అబ్బే! అంత భారం ఏం కాదు..

13 Feb, 2020 08:01 IST|Sakshi
జిల్లా ఈపీడీసీఎల్‌ కార్యాలయం 

కొత్త టారిఫ్‌ సామాన్యులకు మేలు

విద్యుత్‌ చార్జీలు పెంచకుండా అమల్లోకి తెస్తున్న కొత్త టారిఫ్‌

నెలకి 500యూనిట్లు దాటి వినియోగించేవారిపైనే కాసింత భారం

 జిల్లాలో మొత్తం సర్వీసులు

8లక్షల 35వేల 745  కొత్త టారిఫ్‌తో భారం పడనున్న సర్వీసులు 975మాత్రమే

స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్‌కు రాయితీలు

ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి   

విద్యుత్‌ చార్జీల పెంపు.. సాధారణంగా పెంపు అంటే అన్ని వర్గాలపై భారం పడుతుంది. కానీ ప్రభుత్వ ప్రకటనను పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రం భారమనిపించదు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త టారిఫ్‌తో కొన్ని వర్గాలకు స్వల్ప మొత్తంలో భారం పడనుండగా.. సామాన్యులకు, మధ్య తరగతి జీవులకు మాత్రం ఈ టారిఫ్‌ రిలీఫ్‌ ఇవ్వనుంది. ఒక ఇంటిలో గతంలో ఒకరు అద్దెకు ఉండి అధిక స్థాయిలో విద్యుత్‌ వినియోగిస్తే కొత్తగా అద్దెకు దిగిన వారు సైతం ఆ భారాన్ని మోయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త టారిఫ్‌తో ఆ దుస్థితి తప్పుతుంది. ఎంత మేరకు వాడితే అంత మేరకే బిల్లు చెల్లించేలా శ్లాబ్‌ను ప్రభుత్వం మార్చింది. అంతే కాదు గతంలో ఉన్న పద్ధతి ప్రకారం 100 హెచ్‌పీ దాటి విద్యుత్‌ వాడితే ఒక్కోయూనిట్‌కు రూ.475 వేసేవారు. కానీ ఇప్పుడు ఆ అదనపు ధర రూ.275కు తగ్గింది.  ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకైతే కొత్త పద్ధతి వరమనే చెప్పాలి. ఒక్కో యూనిట్‌పైనా 20పైసలు భారం తగ్గనుంది.   

 సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నా యి. ప్రజలకు మేలు చేస్తున్నా విమర్శించడమే పనిగా వెళ్తున్నాయి. కొత్త విద్యుత్‌ టారిఫ్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతున్నా అదేదో భారం మోపుతున్నట్టు గగ్గోలు పెడుతున్నాయి. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు ఉన్నతాదాయ వర్గాలపై కాసింత భారం వేస్తే దాన్ని భూతద్దంలో చూపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకా రం సామాన్య, మధ్య తరగతి వర్గాలపై భారం మోపకుండా విద్యుత్‌ కొత్త టారిఫ్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమల్లోకి తెస్తున్నారు. 500యూనిట్లు దాటి వినియోగించే వారికి మాత్రమే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 8లక్షల 35వేల 745సర్వీసులుండగా కేవలం 975 మందిపై మాత్రం భారం పడుతుంది. దీనివలన ఏటా రూ. 25లక్షల ఆదాయం విద్యుత్‌ సంస్థలకు సమకూరనుంది.  

భయం పటాపంచలు 
విద్యుత్‌ చార్జీలపై ఆ మధ్య ప్రజల నుంచి జిల్లా నియంత్రణ మండళ్లు వినతులు స్వీకరించాయి. అయినప్పటికీ విద్యుత్‌ చార్జీలు పెంచుతారేమోనని ప్రజలంతా భయపడ్డారు. వాస్త వంగా గృహ వినియోగ సర్వీసులపై కొంతమేర చార్జీలు పెంచాలని, అభివృద్ధి చార్జీలు తదితర వాటిపై ఈపీడీసీఎల్‌ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ 500 యూనిట్లు దాటి వినియోగించే ఉన్నతాదాయ వర్గాలపైనే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లకు పైన వినియోగించే వారిపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున భారం పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి రానుంది.  

బిల్లు భారం పడకుండా.. 
జిల్లాలో గృహ వినియోగ సర్వీసులు 8,35,745 ఉండగా వీటిలో ప్రతి నెలా 500 యూనిట్లు వాడే సర్వీసుల సంఖ్య 975 మాత్రమే ఉంది. మొత్తం గృహ వినియోగదారుల్లో 0.11శాతం మాత్రమే. వీరికి మాత్రమే కాసింత భారం పడుతుంది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా టారిఫ్‌ వర్తిసుంది. ఎక్కువ యూనిట్లను వాడితే ఆ లెక్కన తర్వాత ఆర్థిక సంవత్సరంలో శ్లాబ్‌ ఉంటుంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వినియో గం ఎక్కువగా ఉంటుంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం పెరుగుతుంది. అదే వర్షాకాలం, శీతాకాలం వచ్చేసరికి వినియోగం తగ్గిపోతుంది. అయితే ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా టారిఫ్‌ను నిర్ణయించింది. ముందటి ఏడాది వినియోగం ప్రకారం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి శ్లాబ్‌ నిర్ణయించడం జరిగేది. దీంతో ఏడా దంతా ఒకే పొడవునా శ్లాబ్‌ చార్జీలు భరించాల్సి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా ఏ నెల ఎంత వినియోగిస్తే అంతమేరకు బిల్లింగ్‌ జరగనుంది. ఉదాహరణకు ఈ నెలలో వినియోగం 50 యూనిట్లలోపు ఉంటే దాని ప్రకారమే తదుపరి నెల బిల్లింగ్‌ జరుగుతుంది. నెల వారీగా బిల్లులు మారుతుంటాయి.  

ప్రభుత్వ సంస్థలకు ఉపశమనం  
ప్రభుత్వ పాఠశాలలకూ, వసతి గృహాలకూ విద్యుత్‌ చార్జీల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిట్‌కు రూ. 7.20చొప్పున వసూలు చేసేవారు. ఇకపై యూనిట్‌కు రూ. 7మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు కొంత ప్రయోజనం చేకూరనుంది. 20పైసలు మేర రాయితీ లభించనుంది.  ఈ విధంగా దాదాపు 450 సంస్థలకు మేలు జరగనుంది.

సామాన్యులకు మేలు
ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తున్న కొత్త టారిఫ్‌తో సామాన్యులకు మేలు జరగనుంది. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి భారం తగ్గనుంది. ఇంతవరకు గత సంవత్సరం వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా ఈ సంవత్సరం శ్లాబ్‌ నిర్ణయించేవారు. దీని వల్ల అద్దె ఇళ్లల్లో తరుచూ మారేవారు పెద్ద ఎత్తున భారాన్ని మోయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నెలలో ఎంత వినియోగిస్తే అంతే చార్జీలు పడనున్నాయి. 500 యూనిట్లు దాటి వినియోగిస్తే కాసింత భారం పడనుంది. ఈ రకమైన భారాన్ని మోసేవారి సంఖ్య ప్రతి నెల 975లోపే ఉంటుంది.  
– ఎన్‌.రమేష్,  ట్రాన్స్‌కో ఎస్‌ఈ, శ్రీకాకుళం  

 ప్రభుత్వ పాఠశాలలకు వరం
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్, వర్చువల్‌ తరగతుల నిర్వహణ, నాడు నేడు పథకంలో భాగంగా ప్రతి తరగతి గదికీ విద్యుత్‌ సౌకర్యాల్ని కల్పించడం, నిరంతరాయంగా రన్నింగ్‌ వాటర్‌ను మరుగుదొడ్లకు అందించాలని ప్రభుత్వం సంకల్పం చేసింది. దీంతో సహజంగా కరెంట్‌ బిల్లులు గతం కంటే భి న్నంగా అధికంగా వస్తాయి. కానీ అలా జరగకుండా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యుత్‌ మీటర్ల కేటగిరీలో మార్పులు చేసింది. ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం. దీని ద్వారా ప్రభుత్వ బడులకు అయ్యే విద్యుత్‌ వ్యయం చాలా తగ్గనుంది. 
– శ్యాంకుమార్, ఖాజూరు, కవిటి మండలం

ఇప్పుడు తగ్గుతుంది
గతంలో మాకు అధిక మొత్తంలో శ్లాబ్‌రేటు పడేది. ప్రస్తుతం ఎన్ని యూనిట్‌లు వినియోగిస్తే అన్ని యూనిట్‌లకు విద్యుత్‌ బిల్లు కట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకంగా ఉంది. విద్యుత్‌ వినియోగించాలంటే ఆచి తూచి వినియోగించేవాళ్లము. ఎందుకంటే శ్లాబ్‌ దాటితే యూనిట్‌ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎంత వినియోగిస్తే అంతే సొమ్ము చెల్లిస్తాం కాబట్టి మా పై విద్యు త్‌బిల్లుల భారం కాస్త తగ్గినట్టే. 
– గొరివిల్లి కృష్ణమూర్తి, పొన్నాంపేట, ఆమదాలవలస మండలం  మిల్లర్లకు ఎంతో మేలు 
ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్‌ టారిఫ్‌ల వల్ల రైస్‌మిల్లర్లకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి వరకూ 100 హెచ్‌పీ(ఎల్‌టీ) పరిధిలో ఉన్నాం. ఇప్పుడు దీన్ని 150 హెచ్‌పీ పరిధిలోనికి మార్చారు. దీని వల్ల మిల్లర్లు బాగా లాభ పడనున్నారు. ఈ విధంగా చేయమని గత చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి 100 నుంచి 150 హెచ్‌పీకి మార్చడం వల్ల ప్రయోజనం పొందుతున్నాం. 100 హెచ్‌పీ లోడ్‌ దాటితే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు నుంచి ఇతర ఖర్చులన్నీ మిల్లర్లమే భరించాల్సి వచ్చేది. రూ. 8 లక్షల వరకూ ఆర్థిక భారం పడేది. ఇప్పుడు దీన్ని 150 హెచ్‌పీకి మార్చడం వల్ల విద్యుత్‌ శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో మిల్లర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే గతంలో 100 హెచ్‌పీ దాటితే అదనపు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. మిల్లు రన్‌ చేసినా చేయక పోయినా మినిమం రూ.30 వేలు కట్టేవారం. ఇప్పుడు 100 నుంచి 150 హెచ్‌పీకి పెంచడంతో హెచ్‌టీ బిల్లింగ్‌ విదానంలో ఫిక్స్‌డ్‌ చార్జీలు (కిలోవాట్‌కు రూ.475) చెల్లించే వాళ్లం ఇప్పుడు భారం తగ్గుతుంది. 
– తంగుడు జోగారావు, జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు

 విభాగం        విద్యుత్‌ ధర 

కేటగిరీ ఎ(గృహ)          యూనిట్‌కి( రూ.ల్లో) 
0–50యూనిట్లు         1.45 
51–75యూనిట్లు         2.60 

 కేటగిరీ బి 
0–100యూనిట్లు          2.60 
101–200యూనిట్లు      3.60 
201–225యూనిట్లు      6.90 

 కేటగిరీ సీ( గృహ) 
0–50యూనిట్లు             2.65 
51–100యూనిట్లు         3.35 
101–200యూనిట్లు       5.40 
201–300యూనిట్లు       7.10 
301–400యూనిట్లు       7.95 
401–500యూనిట్లు       8.50 
500యూనిట్లు పైన         9.95 
 వాణిజ్యం 
0–50యూనిట్లు             5.40 
 (55కేవీ వరకూ)
75కేవీ మేజర్‌ 
0–50యూనిట్లు             6.90 
51–100యూనిట్లు         7.65 
101–300యూనిట్లు       9.05 
301–500యూనిట్లు       9.60 
500పైన యూనిట్లు         10.15 

జిల్లాలో ఉన్న విద్యుత్‌ సర్వీసులు : 
8,35,745 

జిల్లాలో ఉన్న పాఠశాలల విద్యుత్‌ సర్వీసులు :
2705 

ప్రభుత్వ వసతి గృహాలు : 
315 

ప్రభుత్వ ఆస్పత్రుల విద్యుత్‌ సర్వీసులు : 
128 

500 యూనిట్లు దాటే విద్యుత్‌ సర్వీసులు :
 975 

మరిన్ని వార్తలు