విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు సుప్రీంలో విచారణ

15 Jul, 2019 16:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌ వేసిన తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం 1157మంది ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్య ఉంటే జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ మాత్రం మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అందరికీ ఆప్షన్లు ఇచ్చిన  జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగుల విభజనను మరింత క్లిష్టం చేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ అరణ్‌మిశ్రా ధర్మాసనం తుది కేటాయింపులు జరిగాక దానిపై సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది.  తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను కూడా పిటిషనర్లకే ఇచ్చింది.

మరిన్ని వార్తలు