కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

30 Dec, 2018 09:41 IST|Sakshi
జగన్‌కు సమస్య వివరిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగులు

శ్రీకాకుళం అర్బన్‌: కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగులను తెలంగాణ తరహాలో రెగ్యులర్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శనివారం పలాస మండలం రేగులపాడు క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విద్యార్హతలు, పనివిధానంపై సంపూర్ణ అధ్యయనం చేసి వారిని క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకతను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారని, అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి పక్కన పెట్టేశారన్నారు.

ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. జగన్‌ను కలిసిన వారిలో ఏపీ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ, చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ బి.రమేష్, స్టేట్‌ కమ్యూనికేటర్‌ కె.జగదీష్, ప్రతినిధులు ఆర్‌.ప్రవీణ్‌కుమార్, డి.హేమకుమార్, వి.ప్రేమ్‌కుమార్, ఎం.గణపతి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు