కదలని గజరాజులు

23 Feb, 2019 08:32 IST|Sakshi
స్వామినాయుడువలస చెరుకు తోటల్లో తిష్ట వేసిన ఏనుగులు గుంపు

విజయనగరం, కొమరాడ: మండలంలోకి గజరాజులు వచ్చి ఆరు నెలలవుతుంది. అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు భయంభయంగానే జీవిస్తున్నారు. రాత్రిపూట నిదురకు సైతం దూరమవుతున్నారు. గజరాజుల సంచారంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను ధ్వంసమయ్యాయి. వీటిని నియంత్రించాల్సిన అటవీ శాఖాధికారులు కంటితుడుపు చర్యలతో సరి పెడుతున్నారు. దీంతో గజరాజులు విధ్వంసం కొనసాగుతూనే ఉంది.

అయినా తూతూమంత్రం చర్యలతోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏనుగుల గుంపు జాతీయ రహదారి దాటి, రైల్వేట్రాక్‌ దాటించి కుమ్మరిగుంట, స్వామినాయుడువలస పొలాల్లో తిష్ట వేశాయి. పగటిపూట కొండల్లో సంచరిస్తూ సాయంత్రానికి రహదారులపైకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, కందివలస, కంబవలస, రావికర్రవలస, కోనవలస తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా