బాసంగిలో ఏనుగుల హల్‌చల్‌

4 Jun, 2019 13:24 IST|Sakshi
నాగావళి నది నుంచి బయటకు వస్తున్న ఏనుగులు

భయాందోళనలో గ్రామస్తులు

వచ్చిన మార్గంలోనే వెళ్లగొట్టే ప్రయత్నం

జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి గ్రామ సమీపంలో నాగావళి నదీ తీరాన ఏనుగులు తిష్టవేశాయి. సోమవారం సా యంత్రం 5 గంటల వరకు నాగావళి నదిలో ఉన్న ఏనుగులు 6 గంటల సమయంలో బాసంగి, వెంకటరాజపురం మధ్య పొ లాలకు చేరాయి. ఎప్పుడు ఏ ప్రమాదా న్ని తలపెడతాయోనని ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. కురుపాం రేంజర్‌ ఎం.మురళీకృష్ణ సిబ్బందిని అప్రమత్తం చేసి  బాసంగి, వెంకటరాజపురం, బిత్రపాడు, గిజబ తదితర గ్రామాల్లో దండోరా వేయించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏనుగులు గతంలో వెళ్లిన తోవనుంచే మళ్లీ వస్తుండడంతో అదే తోవలో వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో రాత్రి సమయాలలో తిరగరాదన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు