గజరాజుల కంట కన్నీరు

8 Jan, 2014 02:28 IST|Sakshi
గజరాజుల కంట కన్నీరు

రామకుప్పం, న్యూస్‌లైన్ : ఇరవై ఏళ్లుగా తమ ఆలనపాలన చూస్తున్న మావటీలు బదిలీ కావడంతో రెండు ఏనుగులు దిగులుపడ్డాయి. ఆహారం ముట్టకుండా, ఎవర్నీ దగ్గరకి రానీయకుండా ఆవేదనతో కన్నీరు కారుస్తున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియూల ఎలిఫెంట్ శాంక్చురీలో ఈ దృశ్యం మూడురోజులుగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువ. జనావాసాలపైకి వచ్చే అడవి ఏనుగులను వెనక్కి తరిమేందుకు అటవీశాఖ అధికారులు 2006లో తిరుపతి నుంచి జయుంత్, గణేష్ అనే రెండు ఏనుగులను కౌండిన్య అభయూరణ్యంలోని ఈ శాంక్చురీకి తీసుకువచ్చారు. వాటితోపాటు నలుగురు మావటీలు కూడా వచ్చారు. అయితే ఈ నలుగురు మావటీలను ఆదివారం తిరుపతికి బదిలీ చేశారు. వారు తిరుపతికి వెళ్లినప్పటినుంచి ఆ రెండూ బెంగపెట్టుకుని ఆహారం తినడం లేదు.
 

మరిన్ని వార్తలు