రెండు రోజులుగా ఏనుగుల విధ్వంసం

17 Jan, 2015 08:51 IST|Sakshi

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాలు వరుసగా జరుగుతున్న ఏనుగుల దాడుల్లో అతలాకుతలం అవుతున్నాయి. బోయుచిన్నాగనపల్లె సమీపంలో సోలార్ కంచె దాటి వచ్చిన ఏనుగుల గుంపు రెండు జట్లుగా విడిపోయాయి. ఏడు ఏనుగులున్న మంద రామనాథపురం వద్ద పంటలపై దాడి చేశాయి. సుబ్రవుణ్యం నాయుడుకు చెందిన బీన్స్, పశుగ్రాసం, శివకుమార్‌కు చెందిన టమాట, గోవిందస్వామిగౌడుకు చెందిన టమాట, బీన్స్ తోటలను ధ్వంసం చేశాయి.

సుబ్రమణ్యంనాయుడుకు చెందిన డ్రిప్ పరికరాలను మరోమారు ధ్వంసం చేశాయి. మరో ఏనుగుల మంద బీసీ పల్లెకు చెందిన హనుమంతుకు సంబంధించిన 150 మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. కొత్తకుంట వద్ద గోవిందు అనే రైతు సాగు చేసిన చెరుకు పంటను, బీసీ పల్లె అశోక్, నారాయణస్వామికి చెందిన గెర్కిన్ పంటను ధ్వంసం చేశాయి.

>
మరిన్ని వార్తలు