కృష్ణగిరిలో గజరాజుల బీభత్సం

4 Feb, 2015 09:24 IST|Sakshi

చిత్తూరు జిల్లా (కుప్పం): తోటివారికి ఏమైనా అయితే మనుషులు స్పందిస్తారో లేదోగాని జంతువులు మాత్రం స్పందిస్తాయని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగుల గుంపు నిరూపించాయి. చిత్తూరు జిల్లా కృష్ణగిరి-హోసూరు జాతీయ రహదారిపై సహచర ఏనుగు మృతితో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దాదాపు 40 ఏనుగులు గుంపుగా వచ్చి రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. అందులోని ఓ ఏనుగు అక్కడిక్కడే మృతి చెందింది. ఇది చూసిన ఏనుగులు ఆవేశంతో ఊగిపోయాయి. ఘీంకారాలు చేస్తూ కారుపై దాడి చేశాయి.

కారును నుజ్జు నుజ్జు చేశాయి. అందులోని ప్రయాణికులను చంపేందుకూ ప్రయత్నించాయి. వారు అతి కష్టం మీద కారు నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏనుగుల దాడి సంఘటనతో జాతీయ రహదారిపై దాదాపు నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.గతంలో కూడా కరెంట్ తీగ తగిలి గజరాజు మృతి చెందిన సంఘటనలో కూడా గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులకు ఆహారం, నీళ్లు లేకనే అడవినుంచి జనారణ్యంలోకి ఏనుగులు గుంపులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గజరాజుల మరణమృదంగం

అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్‌ఐలు!

నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

గోవిందా.. వసూళ్ల దందా!

అత్యవసరమా.. అయితే రావొద్దు!

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

లేని వారికి బొట్టు పెట్టి..

మా దారి.. రహదారి!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

బడి ముందు గుడి నిర్మాణం

ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా?

మంచి రోజులొచ్చాయి

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి

సహకార రంగానికి ఊతం

హజ్‌యాత్ర విమాన షెడ్యూల్‌ ఖరారు

వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు

పెరుగుతున్న పట్నవాసం

రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే

ఉద్యోగాంధ్ర

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీకి సాయంపై వరల్డ్‌ బ్యాంక్‌ స్పష్టత

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు