ఫేక్‌న్యూస్‌ను ప్రజలు నమ్మొద్దు: డీఎస్పీ

6 Jun, 2020 13:15 IST|Sakshi

సాక్షి, ఏలూరు: సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డీఎస్పీ దిలీప్‌ హెచ్చరించారు. సోమవారం నుంచి 14 రోజులు నగరంలో కంప్లీట్‌ లాక్‌డౌన్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఏలూరులో దుమారం రేగింది. దీంతో సోమవారం నుంచి చేయాల్సిన పనులు నిమిత్తం.. శనివారం రోజునే ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఫేక్‌న్యూస్‌ ప్రచారంపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రోజులు పూర్తి లాక్‌డౌన్‌ అనేది దుష్ర్పచారం అని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలను నమ్మొద్దని ప్రజలకు డీఎస్పీ దిలీప్‌ విజ్ఞప్తి చేశారు.
(ఆరుగురికి కరోనా; ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్‌)

మరిన్ని వార్తలు