ఉద్యోగుల సమ్మెతో ఉద్యమం మరింత ఉద్ధృతం

14 Aug, 2013 04:57 IST|Sakshi
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఊపందుకుంది. జిల్లాలోని పలు శాఖల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ కార్యాలయూలు బోసిపోయూరుు. జన జీవనం స్తంభించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం కూడా నిరసనలు మిన్నంటారుు.  డ్రైవర్లు కూడా సమ్మెకు దిగడంతో కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇన్‌చార్జి జేసీ నాగేశ్వరరావు కాలినడకనే కార్యాలయాలకు చేరుకున్నారు. ఖజానా, సాక్షరభారత్ కార్యాయాలకు అధికారులు వచ్చినప్పటికీ ఉద్యోగులు వారిని బయటకు పంపించారు. 
 
 విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో  కలెక్టరేట్‌లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగులు నిరసనలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది భారీ ర్యాలీ చేసి, కలెక్టరేట్‌లోని ఎన్‌జీఓ ఉద్యోగులకు మద్దతు తెలిపారు. నిరుద్యోగ యువకులు, విద్యార్థులు పట్టణ వీధుల్లో రన్ అప్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కోట జంక్షన్ వద్ద మానవహారం, మూడులాంతర్ల మీదుగా   ర్యాలీ నిర్వహించారు.  మోటారు, లారీ యజమానులు, వర్కర్సు ప్రధాన కూడళ్ళల్లో వంటా-వార్పు కార్యక్రమం చేశారు.  రైల్వేస్టేషన్ ప్రాంతంలో స్టేషన్ ఏరియా యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మయూరి జంక్షన్ వద్ద మానవహారం చేశారు. మున్సిపల్ సిబ్బంది సమ్మెతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించారుు. ఆర్టీసీ కాంప్లెక్సులోని వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు.పార్వతీపురంలో పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. నర్సిపురంలో సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు. అన్ని సంఘాల నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ర్యాలీలో ఎమ్మెల్యే జ  యమణి పాల్గొన్నారు. 
 
 బొబ్బిలి నియోజకవర్గంలో సకల జనుల సమ్మె సంపూర్ణంగా జరిగింది.  బొబ్బిలి మండలం పారాది, బాడంగి మండలకేంద్రం, రామభద్రపురం మండలంలో ఆరికతోట వద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.  బొబ్బిలి పట్టణంలో జ్యూట్ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు బేబీనాయన బహుమతులు అందజేశారు. ఏపీ ఎన్జీఓ జేఏసీ, మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన శిబిరాలు ప్రారంభించారు. బొబ్బిలిలో ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఏపీఎన్‌జీలు విజయనగరం-పాలకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.  మండల కేంద్రం నుంచి రణస్థలం వెళ్లే దారిలో ఎంబైరయ్యగుళ్లు,సతివాడ, బొప్పడాం గ్రామాల్లో స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఉదయం నుంచీ ఈ రహదారిని దిగ్బంధించారు.  జిల్లా కేంద్రానికి చెందిన మార్వాడీలు నెల్లిమర్లలో ఆందోళన చేపట్టారు.  భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో  జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.  ఎస్. కోటలో.. సకల జనుల సమ్మె పూర్తిస్థాయిలో జరిగింది. విద్యా, వ్యాపార సంస్థలు, పాఠశాలలు, బ్యాంకులు ప్రభుత్వ కార్యాల యాలు మూతపడ్డాయి. 
 
 ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. అలమండ సంతలో తప్పెటగుళ్లు కళాకారులు నిరసన చేపట్టారు. జామిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, బైఠాయింపు  చేపట్టారు. దేవీ జంక్షన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగారుు.గజపతినగరం నియోజకవర్గంలో లక్కిడాం జంక్షన్‌లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. నరవ, పెనసాం గ్రామాల్లో వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.  గజపతినగరంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మక్కువ శ్రీధర్ 48 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కురుపాం మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా బస్టాండ్ కూడలిలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. శివన్నపేట గ్రామస్తులు కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ నివాసం సమీపంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
మరిన్ని వార్తలు