సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం

24 Jul, 2018 08:08 IST|Sakshi
మాట్లాడుతున్న రఘురామిరెడ్డి

కడప ఎడ్యుకేషన్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ రఘురామిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పోరుయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కడప డీసీఈబీలో ప్రచారజాతకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారజాతను నిర్వహించనున్నట్లు తెలిపారు.

తమ జీవితంలో భధ్రతను దెబ్బతీసే సీసీఎస్‌ను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ సుబ్రయణ్యంరాజు, సెక్రటరీ విజయ్‌కుమార్, నాయకులు లక్ష్మిరాజా, రఘనాధరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, శివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నిత్యప్రభాకర్, సివిప్రసాద్, సుబ్బరాజు, నరసింహారెడ్డి, గురవయ్య, మహేష్‌బాబు, శ్రీనివాసులరెడ్డి, మణికుమార్, ఖాదర్‌భాష తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు