ఎక్కేమెట్టు.. దిగేమెట్టు..రెండూ అక్కడే

3 Jul, 2019 09:04 IST|Sakshi

సాక్షి, కాకినాడ : స్థానిక జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వారి స్థానాలను వదిలేందుకు ఇష్టపడడంలేదు. సుమారు  15 నుంచి 20 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో చేయి తడపందే ఏ పనీ జరగడంలేదు. వారు సమయపాలన పాటించకపోవడంతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు.సబ్‌ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా చిట్‌ఫండ్, జిల్లా ఆడిట్‌ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉంటాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు ‘ఎ’ కేటగిరీలోను, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, చిట్‌ఫండ్, ఆడిట్‌ కార్యాలయాల ఉద్యోగులు ‘సి’ కేటగిరిలో ఉంటారు.

బదిలీల సందర్భంలో ఎ కేటగిరీలో పని చేసే ఉద్యోగులు సి కేటగిరీలోకి (జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, చిట్‌ఫండ్‌ కార్యాలయం, ఆడిట్‌ కార్యాలయాలు) బదిలీ అవుతారు. నెల రోజుల అనంతరం ఏలూరు డీఐజీ కార్యాలయంలో పైరవీలు చేయించుకుని ఆఫీస్‌ ఆర్డర్‌ పేరుతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని యథాస్థానాలకు చేరిపోతారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని మూడు విభాగాల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారు సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇక్కడే  ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు కాకినాడలోని ఈ మూడు విభాగాల్లోనే రంగులరాట్నంలా తిరుగుతున్నారు. ఈ కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఏ పనీ జరగదు. ఇప్పుడు బదిలీల్లో మళ్లీ ఇదే తంతు నడుస్తోంది.

ఆఫీస్‌ ఆర్డర్‌తో బదిలీలు ఇలా...
కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నప్పటికీ గత కౌన్సెలింగ్‌లో వాటిని భర్తీ చేయలేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, చిట్‌ఫండ్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో ఆఫీస్‌ ఆర్డర్‌ పేరుతో ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఒక ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు తీసుకుంటారని, ఆఫీసర్‌ ఆర్డర్‌ పేరుతో బదిలీ చేస్తారని ఉద్యోగవర్గాలు చెబుతున్నారు. ఈ బదిలీల కౌన్సెలింగ్‌లోనైనా పైరవీలకు తావులేకుండా సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేస్తారో లేదో వేచి చూడాలి.

బదిలీల జాబితాల్లో అవకతవకలు
ఏళ్ల తరబడి ఉన్న సీనియర్‌ అసిస్టెంట్లు గ్రూపుగా ఏర్పడి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా జాబితా తయారు చేసుకుని,  ఇతర ప్రాంతాలకు చెందిన సీనియర్‌ అసిస్టెంట్లకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల జాబితాల్లో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కాకినాడలోనే ఎ కేటగిరీలో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ సి కేటగిరీగా ఉన్నట్టు బదిలీల జాబితాలో తయారు చేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం

కలక్టరేట్‌ ఎదుట యువతి ఆత్మాహత్యాయత్నం

చంద్ర డాబు

అటవీ శాఖలో అవినీతి వృక్షం

పర్యాటకుల్ని మింగేస్తున్న సరియా జలపాతం..

వృత్తి ఆటోడ్రైవర్‌.. విదేశీయులకు సైతం మెలకువలు

ఆ హాస్పిటల్‌ను మూసివేశాం : మంత్రి ఆళ్ల నాని

పోలవరం ప్రాజెక్ట్‌ ఏపీకి సంజీవిని : అనిల్‌ కుమార్‌

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

రా‘మాయ’పట్నమేనా..!

గోదాముల్లో రికార్డుల గందరగోళం

12 సర్కిల్‌ స్టేషన్లను ప్రారంభించాల్సి ఉంది

కడలి కెరటాలకు యువకుడి బలి

అక్రమాల ఇంద్రుడు

బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు!

గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..

ఆ వీఆర్‌ఓ.. అన్నింటా సిద్ధహస్తుడు..

గోల్‌మాల్‌ గోవిందా !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!