తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులదే కీలకపాత్ర

9 Jan, 2014 00:09 IST|Sakshi

పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని టీటీడీ క ళ్యాణ మండపంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం  క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కేతావత్ లక్ష్మణ్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్, టీజీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబర్‌సింగ్  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలో అతిపెద్ద సంఘంగా టీజీయూఎస్ ఎదుగుతుందని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి అంబర్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు కేతావ త్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి తిమ్యానాయక్ పేర్కొన్నారు. ఎస్టీలకు జిల్లా యూనిట్‌గా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
 
 గిరిజన జాతి పేరుతో  రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు జాతి అభివృద్ధికోసం, తండాల బాగుకోసం పాటు పడాలని  పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలువంచి హక్కులు సాధించుకుంటామన్నారు. ఓటు అనే ఆయుధంతో డిమాండ్లు నెరవేర్చుకుంటామన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి(డీసీటీఓ) రాంచందర్ మాట్లాడుతూ.. సంఘాలు ఎన్ని కార్యక్రమాలు చేపడితే అంత బలోపేతమవుతాయన్నారు. గు ర్తింపు అడుకుంటే వచ్చేది కాదు... అది సా ధించుకోవాలన్నారు. మనం చేసే పనులే మ నకు గుర్తింపు తెచ్చిపెడతాయన్నారు. ఇతర గిరిజన ఉద్యోగులు, సంఘాలు, మేధావుల సలహాలు సూచనలు తీసుకుని టీజీయూఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సంఘం సమస్యలతో పాటు తండాల్లోని ప్రజల సమస్యలు పట్టించుకోవాలన్నారు.  డిప్యూటీఈఓ హరిశ్చందర్ మాట్లాడుతూ.. తండాల్లో వెనుకబడిన వారికోసం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో టీజీయూఎస్  , జిల్లాకు చెందిన ఆయా పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్, రాములు, వెం కట్, హరిలాల్, రూప్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బాబాయ్య పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు