రీస్టార్ట్‌తో 15,399 మంది వలస కూలీలకు ఉపాధి

26 Apr, 2020 04:18 IST|Sakshi

‘రీస్టార్ట్‌’ కార్యక్రమంతో తిరిగి ప్రారంభమైన 258 కంపెనీలు

516 ఇటుక బట్టీలు ప్రారంభం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలస కూలీలు, ప్రజలకు ఆర్థిక చేయూతను అందించే లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన ‘రీస్టార్ట్‌’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. కట్టుదిట్టమైన చర్యలతో ఉద్యోగులకు పూర్తి భద్రతను కల్పిస్తూ.. గ్రీన్‌ జోన్‌లో ఉన్న పరిశ్రమలను తిరిగి ప్రారంభించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 20 నుంచి రీస్టార్ట్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే 1,134 కంపెనీలు పనిచేస్తుండగా రీస్టార్ట్‌ కింద మరో 258 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి.
► ఇప్పటివరకు 1,012 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకోగా 258 కంపెనీలకు అనుమతులు మంజూరు చేశారు. మరో 610 కంపెనీల అనుమతుల మంజూరు పరిశీలనలో ఉంది. మిగిలినవాటికి అనుమతులు మంజూరు చేయలేదు.
► రాష్ట్ర పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 77,943 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. రీస్టార్ట్‌ కార్యక్రమం ప్రారంభించిన ఐదు రోజుల్లోనే వీరిలో 15,399 మందికి ఉపాధి లభించింది. ఇందులో 13,210 మంది వివిధ పరిశ్రమల్లో పనిచేస్తుండగా 2,189 మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు.
నిర్మాణ రంగ పనులకు అనుమతులు
► గ్రామీణ ఉపాధిలో కీలక పాత్ర పోషించే ఇటుక బట్టీలు రాష్ట్రవ్యాప్తంగా 1,943 ఉండగా ఇందులో 516 తిరిగి ప్రారంభమయ్యాయి.
► అలాగే రాష్ట్రవ్యాప్తంగా 53,786 నిర్మాణ రంగ పనులు చేయాల్సి ఉండగా అందులో 1,742 మంది పనులు ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 1,532 మందికి అనుమతులు మంజూరు చేశారు. 

గణాంకాలు.. 

>
మరిన్ని వార్తలు