ఏసీబీకి చిక్కిన ఉపాధికల్పన శాఖ అధికారి

15 Mar, 2016 15:49 IST|Sakshi

స్టీల్‌ప్లాంట్ భూ నిర్వాసితుడి నుంచి లంచం తీసుకుంటూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. వివరాలివీ... విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి రామయ్యకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆర్.కార్డు ఇచ్చింది. ఈ కార్డు ద్వారా ఆయన ఉక్కు కర్మాగారం నుంచి ప్రయోజనం పొందే వీలుంటుంది.

ఈ కార్డులో పేరు మార్చాలని రామయ్య కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, ఆ పని చేసేందుకు జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ అధికారి సతీష్‌కుమార్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. వారి సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం సతీష్‌కుమార్‌కు లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు