తప్పుల సవరణకు 17 వరకు గడువు

16 Apr, 2017 01:48 IST|Sakshi

ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబా వెల్లడి

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు(కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్‌–2017కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఈనెల 17 వరకు గడువుందని ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సాయిబాబా తెలిపారు.  సంబంధిత ధ్రువపత్రాలను జతపరుస్తూ onlineapeamcet2017@gmail. comకు మెయిల్‌ పంపించాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

ఎంసెట్‌కు రూ. 5 వేల అపరాధ రుసుముతో ఈనెల 17 వరకు, రూ. 10 వేల రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. స్క్రయిబ్‌ కావాలనుకొనే అభ్యర్థులు ఎవరి సహాయంతో పరీక్షకు హాజరవుతారో ఆ అభ్యర్థిని ఎంసెట్‌ కార్యాలయానికి తీసుకువచ్చి అనుమతి పొందాలని చెప్పారు. ఇంజనీరింగ్‌ పరీక్షను ఈనెల 24, 25, 26 తేదీల్లో, అగ్రికల్చర్‌ పరీక్షను ఏప్రిల్‌ 28న నిర్వహిస్తామన్నారు. సందేహాల నివృత్తికి 0884–2340535, 0884–2356255 నంబర్లలో లేదా ‘ఆన్‌లైన్‌ఏపీఎంసెట్‌ 2017ఎట్‌జీమెయిల్‌.కామ్‌’ ద్వారా సంప్రదిం చవచ్చని  చెప్పారు.

మరిన్ని వార్తలు