వాహనాలు పెరిగాయ్‌

23 Jun, 2020 10:32 IST|Sakshi

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో11,12,758 వాహనాల కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలు జోరుగా సాగింది. వాణిజ్య వాహనాలు కొనుగోళ్లలో 7.71 శాతం వృద్ధి నమోదైంది. వ్యక్తిగత వాహనాల అమ్మకాల్లోనూ 9.50 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో 11,12,758 కొత్త వాహనాలు కొనుగోలు అయినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య 1,31,05,442కు చేరినట్టు పేర్కొంది.

వీటిలో 1.02 కోట్లు వ్యక్తిగత (రవాణేతర) మోటారు సైకిళ్లు ఉండగా.. 8.28 లక్షల వ్యక్తిగత (రవాణేతర) కార్లు ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మొత్తం 16.25 లక్షల వాణిజ్య (రవాణా) వాహనాలు ఉండగా.. వాటిలో 6.20  లక్షల ఆటోలు, 3.97 లక్షల గూడ్స్‌ వాహనాలు, 3.29 లక్షలు ట్రాక్టర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల కొనుగోళ్లలో 9.28 శాతం వృద్ధి నమోదైంది.

మరిన్ని వార్తలు