రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి 

10 Nov, 2019 10:51 IST|Sakshi

రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

సందడిగా భీమిలి ఉత్సవాలు ప్రారంభం 

తగరపువలస(భీమిలి): అంగరంగ వైభవంగా జరుగుతున్న భీమిలి ఉత్సవాలను చూస్తుంటే రెండు నెలల ముందే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి వచ్చినట్టుందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన తగరపువలసలో జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగురవేసి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అదికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మనస్పూర్తిగా జరుపుతున్న ఉత్సవాలు ఇవి అని అన్నారు.  విశాఖ పార్లమెంట్‌ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హయాంలో భీమిలి అభివృద్ధి చెందుతుందన్నారు.  రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం పట్టణాల మద్య ఉన్న భీమిలిలో అతి పురాతన ఆలయాలతో బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతమన్నారు. జిల్లాలో టూరిస్ట్‌లపై అరాచకాలు తగ్గించడానికి గాను టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సహకరించాలని సీపీ ఆర్కే మీనా, కలెక్టరు వినయ్‌చంద్‌లను కోరారు. 

వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశంలో రెండో మున్సిపాల్టీ అయిన భీమిలిలో జిల్లా అవసరాలకు కావలసిన ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఇంచార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కంకణబద్ధులై ఉన్నారన్నారు. అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతినెలా రాష్ట్రంలో కొండవీటి, విజయవాడ వంటి ఉత్సవాలు చేయాలని సూచిస్తే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందుగా భీమిలి ప్రజలకు అవకాశం కలి్పంచారన్నారు.


పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ అత్యంత సుందరమైన భీమిలికి పండగ వచ్చిందన్నారు. పర్యాటకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పుగోదావరిపులసకు,  నెల్లూరు ఫ్లెమింగ్‌ పక్షలకు, ఒంగోలు గిత్తలకు, కాకినాడ కాజాకు, అరకు కాఫీ, నర్సాపూర్‌ లేస్‌లు ఇలా కలంకారి, సిల్‌్క, కూచిపూడి వంటివి ప్రఖ్యాతమైనవి ఉన్నాయన్నారు. కలెక్టరు విజయ్‌చంద్‌ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి ఉత్సవాల మాదిరిగానే రానున్న 6,7 నెలల్లో అరకు, విశాఖ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. వేడుకలలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ అనకాపల్లి, విజయనగరం ఎంపీలు భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల, గజపతినగరం ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, రొంగలి జగన్నాథం,  నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా