పేద భక్తులకు దివ్యదర్శనం కరువేనా ?

27 Jun, 2018 08:04 IST|Sakshi
ఆలయాల సందర్శనకు బయలుదేరిన పట్టణవాసులు

కార్యక్రమంపై సరైన ప్రచారం చేపట్టని వైనం

దేవాదాయశాఖ అధికారులపై అభాగ్యుల ఆగ్రహం

పలమనేరు: రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఆర్థికస్థోమత లేని పేద భక్తులకోసం ప్రభుత్వం దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన దివ్యదర్శనం కార్యక్రమం పలమనేరులో అభాసుపాలైంది. అధికారులు దీనిపై సరైన ప్రచారం చేపట్టపోవడంతో ఆఖరిరోజు అందుబాటులో ఉన్నవారిని మాత్రం పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు. ఎన్నో ఆశలతో ఆలయం వద్దకొచ్చిన పేద భక్తులు చేసేదిలేక వెనుదిరిగారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి నెలా ఓ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆసక్తిగలవారు తమ ఆధార్‌ కార్డు ను స్థానిక ఈఓ కార్యాయంలో అందించి దరఖా స్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ని నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కాణిపాకం, తిరుపతి, తిరుమల, జొన్నవాడ, పెద్దకాకాని, విజ యవాడ, అమరావతి, సింగరాయకొండ, శ్రీకాళహస్తి దేవాలయాలకు అధికారులకు ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తారు.

అయితే ఈ కార్యక్రమంపై దేవా దాయ శాఖ అధికారులు సరైన ప్రచారం చేపట్ట లేదు. మంగళవారం ఉదయం స్థానిక శివాలయం నుంచి నాలుగు బస్సులు బయలుదేరాయి. ఇందులో మండలంలోని గ్రామాలకు చెందిన వారిని కాకుండా ఆర్థికంగా డబ్బులున్న పట్టణ వాసులను ఎక్కువగా అప్పటికప్పుడు పిలిపించి తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారితీసింది. ఏదో రూపంలో సమాచారంఅందుకుని ఆలయం వద్దకొచ్చిన పేదభక్తులు తాము వస్తామని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో తాము దివ్యదర్శనానికి నోచుకోకుండా పోయామని పలువురు భక్తులు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక దేవాదాయ శాఖ ఈఓ రమణను వివరణ కోరగా, ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి తామేమీ చేయలేమన్నారు. ఈ కార్యక్రమం రెండేళ్లుగా సాగుతోందని ప్రతినెలా ఓ మండలవాసులను ఆలయాలకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఇకపై మరింత ఎక్కువగా ప్రచారం చేస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు