ఇంజినీరింగ్‌లో 73 శాతం ప్రవేశాలు

6 Jun, 2018 07:27 IST|Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌ : ఇంజినీరింగ్‌ సీట్ల అలాట్‌మెంట్‌ను ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. జిల్లాలోని ఆరు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2217 సీట్లకు గాను 1626 సీట్లలో(73.24 శాతం) ప్రవేశాలు జరిగాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది తొలిసారి ప్రారంభించిన ఇంజినీరింగ్‌ కాలేజీలో 180కి 169 సీట్లు అలాట్‌ అయ్యాయి. రెండో కౌన్సెలింగ్‌ శత శాతం ప్రవేశాలు జరిగాయి. మూడు బ్రాంచ్‌లు ప్రారంభించగా సీఎస్‌ఈలో 60కి 57, ఈసీఈ, మెకానికల్‌లో 60కి 56 చొప్పున ప్రవేశాలు జరిగాయి. రెండు ప్రైవేట్‌ కళాశాలల్లో 50 శాతం లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ ఏడాది 7886 మంది ఎంసెట్‌ రాశారు. 

గత ఏడాది 1953కి 1496 సీట్లలో ప్రవేశాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది అరు ప్రైవేట్‌ కళాశాలు ఉండగా, ఒక ప్రైవేట్‌ కళాశాల మూత పడింది. గత ఏడాది తుదివిడత కౌన్సెలింగ్‌లో ఈ కళాశాల తప్పుకుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సీట్లు కాలేజీల్లో రిజర్వ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రత్యేక కేటగిరీకి చెందిన ఆంగ్లో ఇండియన్‌ దివ్యాంగులు క్రీడలు క్యాప్, ఎన్‌సీసీ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించలేదు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఈ ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు ప్రైవేటు కళాశాలల్లో ఈ సీట్లకు ప్రవేశాలు కల్పించకుండా వదిలేశారు.

మరిన్ని వార్తలు