చీర మాయం : సూర్యలత సస్పెండ్‌

7 Aug, 2018 15:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ : బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు ఆయన చైర్మన్‌ గౌరంగబాబు సూర్యలతపై చర్యలు తీసుకున్నారు. చీర మాయం ఘటనపై ఆలయ ఈవో పద్మ నివేదిక సిద్ధం చేశారు. ఆలయ ట్రస్టు బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేశారని తెలిసింది.

చీర మాయం విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్‌ అయిన నేపథ్యంలో కదిలిన ఈవో నివేదికను రూపొందించారు. అయితే, నివేదికను ప్రభుత్వానికి పంపే ముందు ఈవో పద్మ వన్‌టౌన్‌ పోలీసులతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సీసీ టీవీ ఫుటేజి లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవోకు పోలీసులు తెలిపారు.

దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

నాది తప్పు ఎలా అవుతుంది : సూర్యలత
చీర వివాదంపై ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాట్లాడారు. ఆలయ చైర్మన్‌, ఈఓలు భక్తుల నుంచి సన్మానాలు స్వీకరిస్తే తప్పు కానిది, తాను భక్తులు సన్మానించిన చీరను తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. చైర్మన్‌ నుంచి తనకు ఇంకా సస్పెన్షన్‌ ఆర్డర్‌ రాలేదని చెప్పారు.

ఆలయంలోని కొందరు కుట్రపూరితంగానే ఇలా చేశారని అన్నారు. ఆలయ అర్చకుడు శాండిల్య చేసిన ఆరోపణలతో తనను ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. భక్తుల నుండి నేను చీరలు ప్రసాదంగా తీసుకున్నానని చైర్మన్ అనడం సరికాదని చెప్పారు. పాలకమండలిలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీఎం జగన్‌ చాలా సాదాసీదాగా ఉన్నారు’

వైఎస్‌ జగన్‌తో హిందూ గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త హత్యకు భార్య స్కెచ్‌, 10 లక్షల సుపారీ

టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..

ఏపీలో 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

చంద్రబాబు అహంకారానికిది నిదర్శనం: మంత్రి

జసిత్‌ కిడ్నాప్‌ కేసును ఛేదిస్తాం: ఎస్పీ

‘వైఎస్‌ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’

ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం

జమ్మలమడుగులో బాంబుల కలకలం

వినతుల పరిష్కారంలో పురోగతి : సీఎం జగన్‌

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ప్రజా సే‘నాని’.. సంక్షేమ వారధి..

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

భారమని‘పించనే లేదు’

ఇప్పటికింకా నా వయసు..

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

కాంట్రాక్టర్‌ మాయాజాలం

మహిళ మొక్కవోని దీక్ష

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

పేరేమో చేపది... సాగేమో రొయ్యది

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

సం‘సారా’లు బుగ్గి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!