మద్యం మహమ్మారిని తరిమికొడదాం

22 Jan, 2014 03:36 IST|Sakshi

 ఖిల్లాఘనపురం, న్యూస్‌లైన్: గ్రామాల్లోని మహిళలు, యువకు లు, ఎక్సైజ్ అధికారులతో కలిసి మద్యం మహమ్మారిని తరిమికొడదామని  ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ అన్నారు. నాలుగు రోజు లుగా ఖిల్లాఘనపురం మండలం ఉప్పరిపల్లిలో నాటుసారా, మద్యం బెల్టుషాపులను తొలగించాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సం దర్భంగా మహబూబ్‌నగర్‌లో కలెక్టర్ గిరిజాశంకర్‌ను కలిసి విన్నవించారు.
 
 ఆయన ఆదేశాల మేరకు మంగళవారం గ్రామంలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహిళలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామపంచా యతీ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం బెల్టు షాపులను యథేచ్ఛ గా నిర్వహిస్తున్నారన్నారు. తాగేందుకు డబ్బులు లేని సమయంలో తమ భర్తలు ఇంట్లో ఉన్న సామగ్రి సైతం అమ్ముకుం టున్నారని వాపోయారు.
 
 ఒకవైపు తా ము నిరసన కార్యక్రమాలు చేపడుతుం టే మరోవైపు రాత్రివేళ తమ భర్తలకు మద్యం తాగించి ఇంటికి పంపడంతో గొడవ పెట్టుకుని తీవ్రంగా కొడుతున్నారన్నారు. సోమవారం రాత్రి ఊషన్న ఫుల్‌గా తాగి భార్యాపిల్లలను కొట్టడంతో వారు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్యం అమ్మకుండా తగు చర్యలు తీసుకోవాల ని కోరారు. దీనికి ఏసీ బదులిస్తూ మహిళల్లో చైతన్యం రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక నుంచి గ్రామంలో ఎవరైనా నాటుసారా, మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు ఫోనోలో సమాచారమివ్వాలన్నారు. అనంతరం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. తాగి ఎవరైనా గొడవ చేస్తే వెంట నే సమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జానయ్య, సీఐ నారాయణ, ఎస్‌ఐలు రాములు, సాయన్న, మైమూద్‌ఖాన్ పాల్గొన్నారు.
 
 మహిళా సంఘాల సభ్యులతో కమిటీ
 మద్యం మహమ్మారిని అరికట్టేందుకు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా సత్యమ్మ, ఉపాధ్యక్షురాలిగా సాయమ్మ, ప్రధాన కార్యదర్శిగా అలి వేల, కార్యదర్శులుగా వెంకటమ్మ, సుక్కమ్మను ఎన్నుకున్నారు.
 

మరిన్ని వార్తలు