ఈ యుగపు మహాకవి జాషువానే

24 Jun, 2018 11:12 IST|Sakshi
జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఓల్గా తదితరులు 

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా

సాక్షి, అనంతపురం కల్చరల్‌ : సమాజంలోని అసమానతలు తొలిగేలా సాహిత్యాన్ని నడిపించిన 20వ శతాబ్దపు మహాకవిగా గుర్రం జాషువానే గుర్తించాలని ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా అన్నారు.  గుర్రం జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య ఆధ్వర్యంలో ‘మహాకవికి నివాళి’ పేరిట జరిగిన కార్యక్రమంలో  శనివారం నగరానికి విచ్చేసిన ప్రఖ్యాత సాహితీ వేత్తలు ఓల్గా, అక్కినేని కుటుంబరావు, కథా రచయిత సింగమనేని నారాయణ తదితరులు జాషువా జీవితాన్ని, సాహిత్యంలోని విశేషాల గురించి మాట్లాడారు. తెలుగు సాహిత్య రంగంలో అసమాన ప్రతిభతో రాణించిన జాషువా గొప్పతనాన్ని తొలిరోజుల్లో పెద్ద పండితులు గుర్తించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు.

గబ్బిళం రచన ద్వారా సమాజానికి కొత్త సందేశాన్ని అందించిన జాషువా చిరస్మరణీయుడని, ఆయనను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు భావించాలన్నారు. సాహిత్య సభల కోసం అనంతకు విచ్చేసిన తమకు జాషువా విగ్రహం ఏర్పాటు చేసుకుని భక్తితో ఆరాధించుకోవడం ఆనందమేసిందని తెలిపారు. నాగలింగయ్య జాషువా సాహిత్య సేవకునిగా ఎనలేని సేవలందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఓల్గాతో కలిసి పలువురు రచయితలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు భాస్కర్, ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

వైఎస్సార్‌సీపీ రైతు పక్షపాతి : పార్థసారథి

అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..

ఘనంగా గవర్నర్‌ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు

పరిశ్రమలను ఆదుకుంటాం : గౌతమ్‌ రెడ్డి

‘చరిత్ర పునరావృతం కాబోతుంది’

‘గ్రామ వలంటీర్ల నియామకాల్లో అవకతవకల్లేవు’

మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

 సీరియల్‌ మాదిరిగా టీడీపీ నుంచి చేరికలు

‘ఆ రెండు బిల్లులు ఉపసంహరించుకోవాలి’

బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!

‘గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’

కోచింగ్‌ సెంటర్ల నిలువు దోపిడీ 

జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం..

టీడీపీ నేతల గుండెల్లో  ‘ఆగస్టు’ గండం

సచివాలయ పోస్టుల పరీక్ష కేంద్రాలకు కసరత్తు

140 మందికి ఒక్కటే మరుగుదొడ్డి..!

జైల్లో ఎయిడ్స్‌ ఖైదీల కేసుపై హైకోర్టులో విచారణ

సోదరుడిపై దాడి చేసి...యువతిని..

పింగళిని స్మరించుకున్న సీఎం జగన్‌

‘అన్న క్యాంటీన్లలో రూ. 150 కోట్ల స్కాం’

ఎస్సైపై గృహహింస కేసు నమోదు

‘గడికోట’కు కేబినెట్‌ హోదా

గరీబ్‌రథ్‌ పట్టాలు తప్పుతుందా ?

టీడీపీ మహిళా నేత దౌర్జన్యం

భాష్యం స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

హలో..వద్దు మాస్టారు

అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

సహజ నటుడు.. కర్నూలు అల్లుడు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

‘‘డియర్‌ కామ్రేడ్‌’ విజయం సంతోషాన్నిచ్చింది’

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?