దూసుకెళ్లిన ఈయూ

10 Aug, 2018 10:53 IST|Sakshi
తిరుపతి బస్టాండ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ విజయం

231 ఓట్ల ఆధిక్యత

జిల్లా రిత్రలో తొలిసారిగా గుర్తింపు

7 డిపోలలో నిలిచిన ఎన్‌ఎంయూ

తిరుపతి సిటీ: ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఐక్య కూటమి మద్దతిచ్చిన ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) విజ య కేతనం ఎగువేసింది. ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్, ఓస్వాలు ఈయూను బలపర్చిన విషయం తెలిసిందే.  జిల్లా గుర్తింపు యూనియన్‌గా (క్లాస్‌–6)  231 ఓట్ల మెజార్టీ సాధించింది. రాష్ట్రకమిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (క్లాస్‌–3)లోను 321 ఓట్ల మెజార్టీ సాధించింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా ఎంప్లాయిస్‌ యూ నియన్‌  ఈ గుర్తింపు పొందగలిగింది. జిల్లాలో 14 డిపోలతోపాటు ఆర్‌ఎం కార్యాలయం, రీజినల్‌ వర్క్‌షాపులలో గురువారం జరిగిన పోలింగ్‌లో  6,838 ఓట్లకు గాను 6,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్‌ఎంయూ ఏడు చోట్ల గెలుపొందింది. ఎంప్లాయిస్‌యూనియన్‌ ఏడు చోట్ల గెలుపొందడంతోపాటు ఓట్లను ఎన్‌ఎంయూ కంటే 231 ఓట్ల మెజారిటీ   సాధించింది. ఒక్క మదనపల్లె–2 డిపోలో రాష్ట్రానికి సంబంధించిన క్లాస్‌–3లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ 15 ఓట్లు మెజారిటీ సాధించగా, జిల్లాకు సంబందించిన క్లాస్‌–6లో ఎన్‌ఎంయూ 8 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

ఈయూ గెలుపొందిన డిపోలు
అలిపిరి, మంగళం, శ్రీకాళహస్తి, చిత్తూరు–1, పలమనేరు, కుప్పం, తిరుపతి, ఆర్‌ఎం కార్యాలయాల్లో ఈయూ గెలుపొందింది.

ఎన్‌ఎంయూ గెలుపొందిన స్థానాలు
తిరుమల, పుత్తూరు, సత్యవేడు, చిత్తూరు–2, మదనపల్లె–1, పీలేరులో గెలుపొందింది.
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 64 ఓట్లు ఏకపక్షంగా ఎన్‌ఎంయూకు పడినా  జిల్లా గుర్తింపు కష్టమేనని తెలుస్తోంది. పోలైన ఓట్లలో రాష్ట్ర కమిటీ (క్లాస్‌–3)కి  ఎంప్లాయస్‌ యూనియన్‌ 3,488 ఓట్లు పోలు కాగా, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌గా 3,167 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర కమిటీ ఈయూ కు 321 ఓట్లు మెజారిటీ సాధించింది.  రీజియన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ (క్లాస్‌–6)కు 3,437 ఓట్లు వచ్చాయి. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (క్లాస్‌–6)కు 3,206 ఓట్లు పోలయ్యాయి.  ఎంప్లాయిస్‌ యూనియన్‌ 231 ఓట్లు మెజారిటీ సాధించింది. రీజియన్‌ పరిధిలో ఐక్య కూటమి బలపరిచిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ మెజారిటీ సాధించింది.  రాష్ట్ర, ఇటు జిల్లాల్లో ఈయూ   మెజారిటీ సాధించగలిగింది. రాత్రి ఫలితాలు వెలువడగానే డిపోల ఎదుట ఐక్యకూటమి కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్మికులు సం బరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండులో ఈయూ  నాయకులు అవుల ప్రభాకర్‌ యాదవ్, సత్యనారాయణ, ప్రకాష్, జీఆర్‌ చంద్ర, వెంకటేశ్వరులు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నేత భాస్కర్, కార్మికపరిషత్‌ నేతలు, కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు