ఈవ్‌టీజింగ్ కలకలం

14 Sep, 2014 02:18 IST|Sakshi

 పార్వతీపురం : మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యే ఈవ్‌టీజింగ్ సంస్కృతి పార్వతీపురం వంటి పట్టణాలకూ సోకింది. పార్వతీపురం నుంచి దుగ్గేరుకు వెళ్లే బస్సులో ఈవ్‌టీజింగ్ నిత్యం జరుగుతుండటంతో విద్యార్థినులు భయూందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పార్వతీపురం నుంచి దుగ్గేరు వెళ్లే బస్సులో ఇద్దరు యువకులు పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించి యువతి, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి..
 
 మండలంలోని డోకిశీల గ్రామానికి చెందిన యువతి పార్వతీపురంలోని బైపాస్ రోడ్డు మలుపు సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రోజూ ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టాక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది. నిత్యం రద్దీతో కిక్కిరిసి ఉన్న ఈ బస్సులో మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన అల్లరిమూకలోని ఇద్దరు యువకులు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వెకిలి చేష్టలతో హింసించారు. ఈ విషయమై ప్రశ్నించిన యువతిపై దుర్భాషలాడుతూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. బస్సులో జరిగిన అవమానంతో ఇంటికొచ్చిన విద్యార్థిని రోధిస్తూ విషయూన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కళాశాలకు వెళ్లనని వాపోరుుంది. దీంతో విద్యార్థిని, తల్లిదండ్రులు, బంధువులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్‌ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఇద్దరూ నిత్యం అమ్మారుులను వేధిస్తుంటారని బాధితులు తెలిపారు.
 
 గ్రామంలో పంచారుుతీ.. బుజ్జగింపులకు దిగిన టీడీపీ నాయకులు!
 ఈ విషయమై బాధితురాలు పెద్దలకు చెప్పగా గ్రామం లో పంచారుుతీ నిర్వహించారు. యువకుల్ని మందలించి, తమను బుజ్జగించేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రంగంలోకి దిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కూడా మంతనాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు