రెండు కాళ్ళు విరిగినా...

26 Mar, 2015 23:50 IST|Sakshi
శ్రావణిని పరీక్ష హాలుకు తీసుకువెళుతున్న దృశ్యం

అనంతపురం(లేపాక్షి): ధృడ సంకల్పం ముందు విధి చిన్నబోయింది. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం అవిటిదయింది. నడవలేని స్థితిలో ఉండికూడా పరిక్షలు రాయడానికి ప్రాధాన్యత ఇచ్చిన బాలిరెండు కాళ్ళు విరిగినా...కను చూసి చదువుల తల్లే గర్వించిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లురు గ్రామానికి చెందిన శ్రావణి కొండూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరు నెలల కింద జరిగిన ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగాయి. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో తన చదువు కొనసాగిస్తూనే ఉంది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమవడంతో శ్రావణి కాళ్లు సహక రించకున్నా పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది.

శ్రావణి పట్టుదలను గమనించిన పరీక్ష కేంద్రం యాజమాన్యం ఆమె పరీక్ష రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. కచ్చితంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తానని ఆత్మస్థైర్యంతో చెప్తున్న శ్రావణిని చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు