నువ్వైనా.. నేనైనా.. బతుకు పోరాటమే బ్రదర్

5 Dec, 2014 01:38 IST|Sakshi
నువ్వైనా.. నేనైనా.. బతుకు పోరాటమే బ్రదర్

ఆకలి దప్పికలు సృష్టిలో ప్రతి జీవికీ సాధారణమే. విశాల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరుగు  ఆకలి తీరానికే. ఈ చిత్రంలో చూడండి.. పంట పండించి నాలుగు రాళ్లు సంపాదించి..  పట్టెడన్నంతో పొట్ట నింపుకొనేందుకు రైతన్న దమ్ము చేస్తుంటే.. ఆ దమ్ములోనే ఆహారం      వెతుక్కుంటూ పొట్టపోసుకుంటున్నారుు కొంగలు. రాజధాని ప్రభావంతో త్వరలో ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుండటంతో భవిష్యత్తులో రైతన్నకు ఆధారమేమిటో..? భూమినే నమ్ముకుని జీవిస్తున్న ఈ పక్షుల పరిస్థితేమిటో..?
 (తుళ్లూరు మండలం ఐనవోలులో కనిపించిన దృశ్యమిది..)
 
 

మరిన్ని వార్తలు