వాడవాడలా తెలంగాణ సంబరాలు

20 Feb, 2014 00:47 IST|Sakshi
వాడవాడలా తెలంగాణ సంబరాలు


 
 
 ఆలేరు,
 లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం పట్ల బుధవారం ఆలేరు నియోజకవర్గం పరిధిలో వాడవాడలా సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమవుతామని ప్రతినబూనారు. ఆలేరులో సూర్యోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజల రాంచంద్రయ్య, నీలం వెంకటస్వామి, మంగ నర్సింహులు, పుట్ట మల్లేశం, ఇల్లందుల మల్లేషం, పూల నాగయ్య, కె.సాగర్‌రెడ్డి, చొల్లేటి కనకభూషణం, కొలుపుల హరినాథ్, సందుల సురేశ్, బండి నాగయ్య పాల్గొన్నారు.
 సోనియావల్లనే తెలంగాణ ఏర్పాటు
 యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇల్లందుల మల్లేశం అన్నారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీకి ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
 60ఏళ్ల పోరాటం ఫలించింది : కాసం
 ఆలేరు : 60 ఏళ్ల పోరాటం ఫలించి తెలంగాణ స్వప్నం సాకారమయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఆలేరులో సుష్మాస్వరాజ్ చిత్రపటానికీ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలేరులో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దూదిపాళ్ల విజయపాల్‌రెడ్డి, జంపాల శ్రీనివాస్, కావటి సిద్ధిలింగం, పులిపలుపుల మహేశ్, సముద్రాల శ్రీను, పసుపునూరి వీరేశం, చిరిగె శ్రీనివాస్, వడ్డెమాన్ శ్రీను, వడ్డెమాను కిషన్, ఎనగందుల సురేశ్, కుండె సంపత్, కట్కం సత్యనారాయణ, బడుగు జహంగీర్, తోట శోభారాణి పాల్గొన్నారు.
 చారిత్రక ఘట్టం : నగేశ్
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక ఘట్టమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేశ్ పేర్కొన్నారు. ఆలేరులో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తె లంగాణ పునర్నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. తెలంగాణతో పాటు ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో జేఏసీ చైర్మన సుంకరి సత్యనారాయణ, కట్టెగొమ్ముల భాస్కర్‌రెడ్డి, కోటగిరి ఆంజనేయులు, రవి పాల్గొన్నారు.
 కేసీఆర్‌తోనే తెలంగాణ సాధన
 తుర్కపల్లి : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుందని ఆ పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు గంట ఉమారాణి అన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పునిర్నిర్మాణంలో మేథావులు, విద్యార్థులు మమేకమై ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నీరజ, కేతమ్మ, మేకల లావణ్య తదితరులు పాల్గొన్నారు.
 మల్కాపూర్ పాఠశాల విద్యార్థుల ర్యాలీ
 తుర్కపల్లి మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్‌ఎంసీ చైర్మన్ ఆనంద్‌చారి, నారాయణ, మేకల లావణ్య, శేఖర్, శ్రీకాంత్, శ్రీనివాస్, నరేశ్, కరుణాకర్, రవికాంత్, పావన్‌కుమార్, కనకరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
 స్వీట్లు పంచుకున్న సరస్వతి కళాశాల విద్యార్థులు
 రాజాపేట : మండల కేంద్రలోని శ్రీసరస్వతి కళాశాల విద్యార్థులు బాణసంచా కాల్లి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆటా-పాట కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దర్గయ్య, వైస్ ప్రిన్సిపల్ సోమసాని సురేందర్, అధ్యాపకులు శ్రీను, గుర్రం పాండు, బీ నాగేష్, కృష్ణ, రవి, సత్యం, జనార్ధన్, మాధురి, రజిత, అశ్విని, పున్‌రాజ్, హుస్సేన్, కిరణ్, రమేశ్ పాల్గొన్నారు.
 దేవస్థానలం ఉద్యోగుల ర్యాలీ
 యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. జెతైలంగాణ నినాదాలు చేస్తూ రెండు గంటలపాటు ఆలయ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో ఉద్యోగులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమలంఓ ఉద్యోగుల సంఘం నాయకులు గజ్వెల్ రమేశ్, సండ్ర మల్లేశ్, కృష్ణస్వామిగౌడ్, కృష్ణ, గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు.
 తూంకుంటలో విజయోత్సవ ర్యాలీ
 తూంకుంట(బొమ్మలరామారం) : తూంకుంట గ్రామంలో టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వేముల జితేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, మోటె యాదగిరి, రాములు, నర్సింహ, ప్రవీణ్, పద్మ, రమేష్, శ్రీరాములు పాల్గొన్నారు.
 ఉచితంగా టీ పంచిన హోటల్ యజమాని
 ఆత్మకూరు(ఎం) : తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీసంతోషిమాత హోటల్ యజమాని పైళ్ల పద్మారెడ్డి స్థానికులకు బుధవారం ఉచితంగా టీ పోశారు. రోజంతా తాను 1000 టీలు అమ్ముతానని, సుమారు *5000 విలువైన టీని ఉచితంగా పోసినట్లు ఆయన తెలిపారు.
 స్వీట్లు పంచుకున్న కోఆర్డినేటర్లు
 సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు ముద్దసాని దయాకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, కోఆర్డినేటర్లు కోల సతీశ్, ఈరగాని శ్రీనువాస్, పంది రవీందర్, వేముల నర్సింహ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు