నిత్యం ప్రజాపక్షం 

12 Mar, 2019 14:28 IST|Sakshi

పోరాటాలే ఊపిరిగా..

మాట తప్పని.. మడమ తిప్పని వైనం

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...ఆవిర్భావమే ఓ సంచలనం. దూసుకొచ్చిన ఉద్యమ కెరటం. పోరాటాలే ఊపిరిగా  ఉత్తుంగతరంగమై ఉరకలేస్తోంది. పేదల గొంతుకై నినదించింది. గడిచిన ఎనిమిదేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పరితపిస్తున్న వైఎస్సార్‌ సీపీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతోంది.

పేదల గుండె నిండా ఉన్న వైఎస్సార్‌సీపీ జెండా అమరావతిపై రెపరెపలాడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇన్నాళ్లు తమ పక్షాన పోరాడిన ఈ పేదల జెండాను తలెత్తుకునేలా నిలబెడతామంటూ ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం అందిస్తామంటున్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠన్మరణం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల నడుమ వైఎస్సార్‌సీపీ పురుడుపోసుకుంది. ఎనిమిదేళ్లుగా సవాళ్లు..పెనుసవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల గుండెల్లో చొచ్చుకెళ్లింది. కేవలం 1.5శాతం ఓట్లతేడాతో ఆధికారం కోల్పోయినా, గడిచిన నాలుగేళ్లుగా ప్రజల పక్షాన అలుపెరగని పోరు సాగిస్తూనే ఉంది. మహానేతను గుండెల్లో దాచుకున్న గిరిజనులు అరుకు లోక్‌సభ స్థానంతో పాటు రెండు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే పట్టం గట్టారు.

ఆ తర్వాత పదవులు.. ప్యాకేజీల కోసం వారు టీడీపీలోకి ఫిరాయించినా తమ గుండెల్లో వైఎస్సార్‌సీపీ జెండాయే ఉందని చాటిచెప్పారు. కాగా ఇదే జెండా అండతో 2014 ఎన్నికల్లో మాడుగుల నుంచి బరిలోకి దిగిన బూడి ముత్యాలనాయుడును గెలిపించారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, విభజన హామీల కోసం అలుపెరగని పోరు సాగించింది. వైఎస్సార్‌సీపీ పోరు కారణంగానే విశాఖకు రైల్వేజోన్‌ను కేంద్రం ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన మడమతిప్పని పోరు సాగిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఈసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని జిల్లా వాసులు తేల్చిచెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా భూ కబ్జాలు.. దందాలు..దోపిడీపై విసిగివేసారిన విశాఖ జిల్లా వాసులు రానున్న ఎన్నికల్లో అధికార టీడీపీకి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యకలాపాలపై పోరా టాలు సాగిస్తూనే పార్టీని బూత్‌ స్థాయి వరకు బలోపేతం చేసే దిశగా పార్టీ యంత్రాంగం కృషి చేస్తోంది.

మరోపక్క రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనే కాదు. గ్రామ, బూత్‌ స్థాయి వరకు పార్టీ, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటుతో ఇతర పార్టీలకు భిన్నంగా వైఎస్సార్‌ సీపీ నిలిచింది..మరో నెల రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాకు అండగా నిలవాలని జిల్లాలో పార్టీలకతీతంగా ప్రజలు సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు