ప్రతీ ఓటూ ప్రధానమే

19 Nov, 2017 09:05 IST|Sakshi

మలికిపురం (రాజోలు): వైఎస్సార్‌ సీపీకి ప్రతీ ఓటూ ప్రధానమేనని ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అన్నారు. పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారి శనివారం నియోజకవర్గానికి వచ్చారు. మలికిపురంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కాలం చాలా కీలకమని, ప్రతి కార్యకర్త, నాయకుడు ఐకమత్యంతో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పార్టీకి ఎంతో మేలు చేస్తుందని, ఆయనతో పాటు అందరూ కష్టపడి పని చేసేందుకు ఇదే సమయమన్నారు. 

పార్టీ మండల అధ్యక్షుడు అడబాల వీరబ్రహ్మాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాజోలు, పి.గన్నవరం పార్టీ కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి మాట్లాడుతూ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి నడుస్తుందని, ఇందుకు అలుపెరగని పోరాటం చేద్దామని సూచించారు. డీసీసీబీ డైరెక్టర్‌ పాముల విజయరంగారావు, నాయకులు చింతలపాటి వెంకట్రామరాజు, విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపన బుజ్జిరాజు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, ఎస్సీ సెల్‌ కార్యదర్శి నల్లి డేవిడ్, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్, అడ్డగళ్ళ సాయిరామ్, జక్కంపూడి వాసు, సాగి రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా