శాంతిభద్రతల పరిరక్షణ.. అందరి బాధ్యత

25 Mar, 2017 13:53 IST|Sakshi
► సీమ ఐజీ శ్రీధర్‌రావు 
 
చింతకొమ్మదిన్నె : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాయలసీమ ఐజీ ఎన్‌. శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఇటీవల నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి చిన్న పనులను వెంటనే పూర్తి చేసి కడప కర్నూలు రేంజ్‌ డీఐజీకి సమాచారం అందించాలన్నారు. తర్వాత ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్న పోలీస్‌స్టేషన్‌ భవనం, రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, మట్కా, గ్యాబ్లింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని, మండల కార్యాలయాల్లో కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రదేశాలలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇంటిపైన నిద్రిస్తారని, దొంగతనాలు జరగకుండా లాకర్‌ బీగాలను వాడాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో 
సమాచారం అందిస్తే.. ఆ ఇంటికి పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పోలీస్‌స్టేషన్‌ నుంచి నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ సత్య ఏసుబాబు, కడప డివిజన్‌ డీఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్, ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, రూరల్‌ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐలు కుళ్ళాయప్ప. చాంద్‌బాషా పాల్గొన్నారు. 
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు