సమష్టి కృషితోనే అందరికీ ఉపాధి

14 Sep, 2013 04:35 IST|Sakshi

సదగోడు (ఉప్పునుంతల), న్యూస్‌లైన్:  ఉపాధి హామీ పథకంలో కూలీలతో ఏర్పాటు చేసిన సమాఖ్యల భాగస్వామ్యంతో పదిమందికి ఉపయోగపడే నాణ్యమైన పనులు చేపట్టినప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ (టెక్నికల్) శివప్రసాద్ అన్నా రు. శుక్రవారం మండల పరిధిలోని సదగోడులో శ్రమశక్తి సంఘాలు, గ్రామ సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఆయన సమాఖ్యలు ఏర్పడిన తర్వాత పథకం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు, వేతనాలపై ఆరా తీశారు. గ్రామాల్లో అందరికీ ఉపయోగపడే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈజీఎస్‌లో వందశాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. మొక్కలతోపాటు ఐదేళ్లపాటు నిర్వాహణ ఖర్చులు కూడా అందజేస్తామన్నారు. మహిళా సంఘాల మాదిరిగా శ్రమశక్తి సంఘాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పనుల గుర్తింపుపై కూలీలకు అవగాహన కలిపంచేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏపీఓ సాయిశంకర్‌కు సూచించారు.
 
 360 మండలాల్లో సమాఖ్యలు..
 రాష్ట్ర వ్యాప్తంగా 360 మండలాలో పెలైట్ ప్రాజెక్టుగా శ్రమశక్తి సంఘాలను ఎంపిక చేసి వారిని చైతన్యవంతం చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. సమాఖ్యలు, కూలీల్లో చట్టంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నామన్నారు.
 
 చట్టప్రకారం వారికి కల్పించిన హక్కులను పొందడానికి వారు అధికారులను ప్రశ్నించే స్థాయికి ఎదగాలన్నారు. కూలీలు పనులకు దరఖాస్తులు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే వారికి జీవన భృతి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆనంతరం ఆయన ఉప్పునుంతల మండల కార్యాలయంలో పథకం అమ లు తీరు సమీక్షించారు. కార్యక్రమంలో ఏపీడీ పాపయ్య, ఈ జీఎస్ ఏపీఓ సాయిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు