ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం

2 Dec, 2014 11:38 IST|Sakshi

తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. రాజశేఖరరెడ్డి తనకు అనుకూలంగా వ్యవహారించడం లేదని ఓ ఉద్యోగి మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వర్గీయులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి.... ఈ రోజు ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయం గది నుంచి రాజశేఖరరెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా బయటకు నెట్టి... రాజశేఖరరెడ్డి గదికి తాళం వేశారు.

మరిన్ని వార్తలు