టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌ సీపీలో చేరిక 

15 Feb, 2020 08:48 IST|Sakshi
మంత్రి విశ్వరూప్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నమాజీ కౌన్సిలర్‌ బండారు సత్యనారాయణ తదితరులు

మాజీ కౌన్సిలర్, అంబాజీపేట మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్లను..

పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి విశ్వరూప్‌

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన

సాక్షి, అమలాపురం రూరల్‌ :  అమలాపురం పట్టణంలోని టీడీపీకి చెందిన 25 వార్డు మాజీ కౌన్సిలర్‌ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బండారు లోవరాజు(చిన్ని) ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన బండారు సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బండారు లోవరాజులు వెఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరితో పాటు కామన కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్‌ మోగిలి పోతురాజు, బండారు ప్రశాంత్‌ కుమార్‌  కోసూరి వీరన్న తదితరులు పార్టీలో చేరారు. వీరికి మంత్రి విశ్వరూప్‌ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దొమ్మేటి రాము, వంటెద్దు వెంకన్న నాయుడు, గొవ్వాల రాజేష్‌ నాగవరపు వెంకటేశ్వరరావు, 
మద్దింశెట్టి ప్రసాద్, భరకానిబాబు తదితరులు పాల్గొన్నారు. 

పార్టీ స్తూపం ఆవిష్కరించిన మంత్రి విశ్వరూప్‌ 
పట్టణంలో 27 వార్డులో ఏఎంజీ కాలనీలో వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ స్తూపాన్ని, పార్టీ జెండాను మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆవిష్కరించారు. 27 వార్డు బూత్‌ కమిటీ కన్వీనర్‌ బండారు గోవిందు, రంపవలస శ్రీనివాస్‌రావు, పాలెపు చినగంగరాజు ఆధ్వర్యంలో  జరిగిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ కాలనీలో వైఎస్సార్‌ సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు అర్థాని నాగయ్య, అర్ధాని ముత్యాలు, బండారు ఏడుకొండలు, హక్కుల సంఘం అధ్యక్షుడు యండమూరి శ్రీను, పి.గణపతి, చప్పిడి సతీష్, ఓలేటి శ్రీను, తాళ్లరాజు, భావిశెట్టి సురేష్, పి.గణపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు