వైఎస్సార్సీపీలో ఆనం చేరిక నేడు

2 Sep, 2018 11:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న ఆయన శనివారం పాదయాత్ర ముగిశాక పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని చోడవరం శివారులోని రాత్రి బస శిబిరం వద్ద కలిసి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి, ఆనం ముఖ్య అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

 ఇప్పటికే జిల్లాలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాట్లాడారు. గత వారం ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి ఆందరి అభిప్రాయం తెలుసుకొని పార్టీలో చేరిక తేదీని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకొని చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసనం చెరకు కాటా సెంటర్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌తో కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎత్తుకు పైఎత్తు!

ఎంతపని చేశావమ్మా...

కావలికి కళా ఝలక్‌!

‘నిండు’ ప్రాణాలు బలి

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాకు బాగా నచ్చే నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి

బిగ్‌బాస్‌ : బయటికి వచ్చేస్తానంటున్న మాజీ క్రికెటర్‌

అదే నా కోరిక..!

నేను మీ అమ్మాయినే అండీ

యంజీఆర్‌ మళ్లీ వస్తున్నారు

మనవడో... వారసుడో...