‘బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరపాలి’

12 Mar, 2017 17:46 IST|Sakshi
‘బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరపాలి’
అమరావతి: వైఎస్సార్‌ జిల్లా రెండు, ప్రకాశం జిల్లాలో ఒక ఇల్లు మాత్రమే నిర్మించడం దారుణమని ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్‌, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కడతామని చెప్పిన చంద్రబాబు 1846 ఇండ్లను స్లాబ్‌ల వరకు మాత్రమే నిర్మంచారని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఎస్సీలకు రూ.1646 కోట్లకు గత బడ్జెట్ లో కేటాయించి 839 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని,  అలాగే  ఎస్టీ లకు రూ. 573 కోట్లు కేటాయించి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మైనార్టీలకు రూ.370 కోట్ల కేటాయించి రూ.200 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపారు.

ఆర్థిక మంత్రి యనమల గత బడ్జెట్ లో చెప్పిన లెక్కలకు కేటాయించిన నిధులకు పోంతనలేదనని పేర్కొన్నారు. సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో 50శాతం కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టడంలేదని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా 30 రోజులు జరపాలని డిమాండ్‌ చేశారు.
 
 
మరిన్ని వార్తలు