మండల పరిషత్‌లో టీడీపీ నేతల మకాం

23 Jul, 2019 08:14 IST|Sakshi
మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతల సమావేశం

మండల ప్రత్యేకాధికారి గదిలో సభలు, సమావేశాలు

సకల మర్యాదలు చేస్తున్న అధికారులు

సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): వారంతా మాజీలుగా మారిపోయినా అధికార మత్తులోనే జోగుతున్నారు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మకాం వేసి తమ సొంతానికి వినియోగిస్తున్నారు. సభలు, సమావేశాలు అక్కడే నిర్వహిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు సైతం రాచ మర్యాదలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. సంతబొమ్మాళి మండల పరిషత్‌ కార్యాలయంలో కొంతకాలంగా సాగుతున్న తంతు ఇది.

సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఒక వైపు వలంటీర్ల ఇంటర్వ్యూలు, మరో వైపు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. వీరికి సరిపడా కుర్చీలు సైతం వేయించి మండల అధికారులు సకల మర్యాదలు చేశారు. మండల ప్రత్యేకాధికారి  కుర్చీలో మాజీ జెడ్పీటీసీ భర్త ఎల్‌ఎల్‌ నాయుడు అశీనుడయ్యారు. తనకి ఇరువైపులా మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌ భీమారావు, పార్టీ మండలాధ్యక్షుడు జీరు భీమారావు తదితరులు కూర్చొన్నారు.

మాజీలైన వీరందరికీ అధికార మత్తు ఇంకా వదలలేదని, కార్యాలయాల్లో కూర్చుని ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్యాలయంలో ఓ టీడీపీ నేత కూర్చోని తమ పనులను చక్కబెడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.  మండల పరిషత్‌ అధికారులు కూడా టీడీపీ నేతలకు ఎర్ర తివాచీ పరచడంతో వారు ఆడిందే ఆటగా... పాడిందే పాటగా సాగుతోంది. ఈ విషయమై మండల ప్రత్యేకాధికారి వీవీ కృష్ణమూర్తి వివరణ కోరగా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించినట్లు తనకు తెలియదని, ఇక నుంచి తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతానన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

నిప్పులు చిమ్ముతూ...

ఆగస్టు వరకు ఆగాల్సిందే!

ఎస్‌ఐ ఫలితాలు విడుదల

బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు

బీసీల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా.. బీసీ కమిషన్‌ బిల్లు

పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..

నామినేటెడ్‌ పదవుల్లో 50 % రిజర్వేషన్లు 

ఇంటి దోపిడీ రూ.4,930.15 కోట్లు!

చంద్రబాబు బీసీల ద్రోహి

నవశకానికి నాంది

అమరావతిపై వాస్తవపత్రం

జగన్‌ చరిత్ర సృష్టిస్తారు

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

నాన్నగారిలా సలహాలు ఇచ్చారు: సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైఎస్‌ జగన్‌ మరిన్ని సెంచరీలు చేయాలి: నరసింహన్‌

‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

ఆ విషయంలో రాజీ పడబోం : మంత్రి సురేష్

‘అవి బాహుబలి నియామకాలు’

‘దళితుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి’

‘చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు’

ఏపీ ఎస్సై ఫలితాలు: మహిళా టాపర్‌ ప్రజ్ఞ

గొలుసు.. మామూళ్లతో కొలుచు..!

టీడీపీ రాద్ధాంతంపై సీఎం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?