వీళ్లు మామూలోళ్లు కాదు

13 Oct, 2019 11:37 IST|Sakshi

మత్తు వీడనిఎక్సైజ్‌ అధికారులు

సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో మద్యనిషేధం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా తగ్గించింది. ఇది కొందరు ఎక్సైజ్‌ అధికారులకు మింగుడు పడటం లేదు. గతంలో మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి లక్షల్లో మామూళ్లు వీరికి అందేవి. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో వీరి ఆదాయానికి భారీగానే గండిపడింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు మాత్రమే ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తుండటంతో వీరిని మామూళ్ల కోసం పట్టిపీడిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో 20 బార్‌లు
జిల్లాలో గతంలో 437 బ్రాందీ షాపులు, 20 బార్‌లు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం 90 షా పులను తగ్గించి 347 షాపులను ఏర్పాటుచేసింది. 20 బార్‌లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్‌ అధికారుల చూపు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులపై పడింది. జిల్లాలోని 20 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమానుల నుంచి నెలకు బార్‌ ఒక్కింటికీ రూ.30 వేల చొప్పున వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై బార్‌ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రైవేట్‌ బ్రాందీ షాపులు ఉండటం వలన బార్‌ల నుంచి మామూళ్లు ఎంతిస్తే అంతే తీసుకునేవారమని, ప్రస్తు తం ప్రభుత్వమే బ్రాందీ షాపులు నిర్వహించడం వలన ఎౖMð్సజ్‌ స్టేషన్‌కి ఆదాయం లేదని అధికారులు అంటున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌కు ఆదాయం లేదనే సాకుతో ఒక్కో బార్‌ యజమాని నుంచి రూ.30 వేలు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. సొమ్ములు ముట్టజెప్పకపోతే కేసుల పేరుతో వేధిస్తున్నారని అంటున్నారు. ప్రైవే ట్‌ యజమానుల చేతుల్లో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండటంతో కొందరు ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.   

బెడద తగ్గలేదు
జిల్లాలో గతంలో బ్రాందీషాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానుల నుంచి ఎక్సై జ్‌ అధికారులు ప్రతి నెలా లక్షలాది రూపాయలు మామూళ్లు కింద వసూలు చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు ఎౖMð్సజ్‌ అధికారులు బార్‌ యజమానులపై పడుతున్నారు. నెలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.   
– ఆర్‌.వెంకటపతి, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమాని, ఏలూరు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా