ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 10 మంది అరెస్టు

26 Sep, 2015 23:52 IST|Sakshi

 పలాస: టెక్కలి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 మంది నాటు సారా వ్యాపారులను అరెస్టు చేసినట్టు పలాస ఎక్సైజ్ పోలీసు సూపరింటెండెంటు ఎం. భాస్కరరావు విలేకరులకు తెలిపారు. ఎక్సైజ్ కమిషనరు శ్రీనివాస్, డెరైక్టరు దామోదర్, డీసీ సురేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం ఎక్సైజ్ పోలీసులు వివిధ గ్రామాల్లో దాడులు చేశారన్నారు. టెక్కలి, గోపుడూరు, రామరాయి, హొన్నాళి, చీపి, కొండలోగాం, తబాగాం, కంచిలి తదితర ప్రాంతాల్లో సిబ్బంది దాడులు చేశారన్నారు. పది మందిని అరెస్టు చేయడంతోపాటు.. 159 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని, 3400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు