గంజాయి తోటలపై ఎక్సైజ్ దాడులు

22 Nov, 2013 07:03 IST|Sakshi

మనూరు, న్యూస్‌లైన్ : గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్ హరికిషన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు రూ. 15 కోట్లు విలువ చేసే మొక్కలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మనూరు మండ లం ఇరక్‌పల్లి పంచాయతీ శామనాయక్ తండాల్లో 15 ఎకరాల గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

 

దీంతో గురువారం సిబ్బంది దాడులు నిర్వహించినట్లు వివరించారు. పంట మొత్తాన్ని, కూలీలు, ట్రాక్టర్ పెట్టి దున్ని వేయించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సాగుదారులను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్, నారాయణఖేడ్ ఇన్‌చార్జ్ సీఐ సూర్యప్రకాష్, ఎస్‌ఐలు కుర్మయ్య, మురళీధర్, లక్ష్మీనారాయణ, పట్టాభి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు