సైనిక వితంతువులకు ఆస్తిపన్ను మినహాయింపు

14 Nov, 2013 05:01 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: సైనిక వితంతువుల గృహాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆస్తి పన్నుకు సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, మున్సిపాలిటీల చట్టంలో మార్పులు చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సవరణ బిల్లును పురపాలక  శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సైనిక వితంతువుల గృహాలు రె
 
 ండు, మూడు ఉంటే.. వాటిలో ఒక భవనానికి ఆస్తి పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దేశం తరఫున యుద్ధాల్లో పాల్గొని 50 శాతం వైకల్యం పొందిన సైనికుల ఇళ్లకు కూడా ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వనుంది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో త్వరలో చట్టరూపం లభించనుంది. కాగా, ఆస్తి పన్ను విధించే సమయంలో ఆయా భవనాలు/ఇళ్ల నిర్మాణ కాలపరిమితి ఆధారంగా వాటికి 25 నుంచి 75 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నారు. అయితే 13వ ఆర్థిక సంఘం నిధులు తెప్పించుకోవడానికిగాను ప్రజలకు మేలు చేస్తున్న ఈ రాయితీని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు