వ్యాయామ టీచర్ల పోస్టులు తీయడం లేదన్నా..

14 Nov, 2018 06:52 IST|Sakshi

అన్నా నేను వ్యాయామ ఉపాధ్యాయుడుగా శిక్షణ పొంది ఉన్నాను. ఐదేళ్లుగా డీఎస్సీలో వ్యాయామ టీచర్ల పోస్టులు తీయడం లేదన్నా. జిల్లాలో 120మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా శిక్షణ పొంది ఉన్నాం. జిల్లాకి ఒక పోస్టు మాత్రమే కేటాయిస్తున్నారన్నా. మీరు అధికారంలోకి రాగానే డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు తీయాలన్నా...        –బత్తిన గణపతి,అంపావల్లి, బలిజిపేట

సీఎంగా చూడాలని కోరికగా ఉంది నాయనా...
ప్రజాసంకత్పయాత్ర బృందం: నాయనా...నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలి.. అంటూ తామరకండి గ్రామానికి చెందిన ఓ కురు వృద్ధురాలు ఏగిరెడ్డి చిన్నమ్మ పేర్కొంది. ఆ గ్రామం మీదుగా ప్రజాసంకల్పయాత్ర మంగళవారం సాగినప్పుడు రోడ్డు పక్కన ఓ ఇంటి వద్ద ఆమె తన కుటుంబ సభ్యులతో ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా జగన్‌ ఆమె వద్దకు వెళ్లి అవ్వా...బాగున్నావా..అంటూ అడిగారు. దీనిపై స్పందించిన అవ్వ బాగున్నాను..నాయనా...నువ్వా బాగున్నావా..అంటూ జగన్‌తో మాట్లాడింది. నిన్ను సీఎంగా చూడాలని ఉంది నాయనా అంటూ ఆశీర్వదించింది. నాకు 96 సంవత్సరాలు..నీపై కుట్రతో గాయం చేశారని టీవీలో చూసి కుటుంబమంతా బాధపడ్డాం. నువ్వు ఎప్పుడు వస్తావా...చూద్దామని ఆశతో ఎదురు చూశాం. మా కోరిక తీరింది...నువ్వు సీఎం అవుతావు...నా కళ్లారా నిన్ను టీవీలో చూసుకుంటా...అంటూ చిన్నమ్మ దీవించింది.

మరిన్ని వార్తలు