మూడు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన

21 Jun, 2020 12:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికితోడు కోస్తాపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయి.రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి.

  • రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్ష సూచన. 
  • కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 –50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. 
  • గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. 
మరిన్ని వార్తలు