పల్లె వెలుగులే నాన్‌స్టాప్‌లు

28 Dec, 2018 09:13 IST|Sakshi
ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తూ ఆర్టీసీ నాన్‌స్టాప్‌గా నడుపుతున్న పల్లె వెలుగు బస్సు

పల్లె వెలుగు బస్సుకు ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్‌

రాజమహేంద్రవరం – కాకినాడకు నాన్‌ స్టాప్‌గా

పల్లెవెలుగు బస్సులు నిత్యం మోసపోతున్న ప్రయాణికులు

రాజమహేంద్రవరం సిటీ: పల్లె వెలుగు బస్సు ఏర్పాటు చేసి ఎక్స్‌ప్రెస్‌ బస్‌ చార్జీ వసూలు చేస్తూ ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం డిపో నుంచి కాకినాడకు నిత్యం తెల్లవారు జాము నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు చొప్పున నాన్‌ స్టాప్‌ సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్‌ లగ్జరీ బస్సులను నడపాల్సింది, రోజూకు రెండు నగరాల మధ్య 60 సర్వీసులను నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జీ రూ.65, ఆల్ట్రా డీలక్స్‌ రూ.80 సూపర్‌ డీలక్స్‌ రూ.85లు టిక్కెట్‌గా వసూలు చేస్తోంది.

రాజమహేంద్రవరం– కాకినాడల మధ్య ఎక్స్‌ప్రెస్‌ బస్సు గంటన్నర సేపు ప్రయాణి స్తుంది. రూ.65లు వసూలు చేస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో ‘పల్లె వెలుగు’లను నడుపుతూ ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జీ వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. రోజూ తిరిగే 60 సర్వీస్సుల్లో 40 సర్వీసులు పల్లె వెలుగు బస్సులను నడుపుతూ ఆర్టీసీ మోసాలకు పాల్పడుతోంది.ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో గంటన్నర సేపు జరగాల్సిన ప్రయాణం పల్లెవెలుగు బస్సుల్లో రెండున్నర గంటల సేపు ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయమై స్టేషన్‌ మేనేజర్‌ కొండలరావును వివరణ కోరగా బస్సులు కొరతవల్ల ‘పల్లె వెలుగు’లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు