కోవిడ్‌ ఆస్పత్రి: కార్మికుల విధుల బహిష్కరణ 

7 May, 2020 08:57 IST|Sakshi

సూపరింటెండెంట్‌ వైఖరిపై ఫిర్యాదు 

చక్కదిద్దిన కలెక్టర్‌ శేషగిరిబాబు

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): స్థానిక దర్గామిట్టలోని పెద్దాస్పత్రి (కోవిడ్‌)లో 262 మంది కార్మికులు ఉన్న పళంగా బుధవారం ఉదయం విధులు బహిష్కరించారు. ప్రభుత్వం తమకు జీతాలు ఇచ్చేందుకు బడ్జెట్‌ ఇచ్చినప్పటికీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్‌ శేషగిరిబాబు తక్షణమే స్పందించారు. కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడారు. తక్షణమే విధుల్లోకి వెళ్లాలని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఎందుకు జీతాల బిల్లు పెట్టలేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీహరిని కలెక్టర్‌ సంజాయిషీ అడిగారు. బడ్జెట్‌ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్‌ నర్సింగ్‌ సిబ్బందికి కూడా జీతాలు రెండు నెలలుగా ఇవ్వలేదనే విషయం కూడా తెలిసింది. ఆయా సమస్యలపై నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా కలెక్టర్‌తో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించడంతో మూడు గంటల అనంతరం కారి్మకులు విధుల్లో చేరారు.       

మరిన్ని వార్తలు