తిరుమలలో ఆలస్యంగా బయటపడ్డ నకిలీ టికెట్ల బాగోతం

10 Feb, 2020 14:56 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో కేటుగాళ్ల చేష్టలు మితిమీరిపోతున్నాయి. నకిలీ టికెట్లను అమాయక భక్తులకు విక్రయిస్తూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన నకిలీ అభిషేకం టికెట్ల వ్యవహారం తిరుమలలో కలకలం రేపుతోంది. శుక్రవారం టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ నకిలీ టికెట్ల బాగోతం బయటపడింది. శ్రీవారి అభిషేకం టికెట్లను పోలి ఉన్న నకిలీ టికెట్లతో క్యూలైన్‌లో నిలబడ్డ 14 మంది భక్తులను విజిలెన్స్‌ విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వారిని తనిఖీ చేయగా ఓ ముఠా దగ్గర కొనుగోలు చేసిన నకిలీ అభిషేకం టికెట్లతో లైన్‌లో ప్రవేశించారని తెలిసింది. చెన్నైకి చెందిన ముఠా 14 నకిలీ టికెట్లను రూ.73 వేలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: జగజ్జంత్రీపై విజిలెన్స్‌

మరిన్ని వార్తలు