నకిలీ నోట్ల ముఠా అరెస్టు

7 Sep, 2015 13:22 IST|Sakshi

అనంతపురం: నకిలీనోట్లు చెలామణీ చేస్తున్న ఆరుగురిని అనంతపురం వన్ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,800 విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా గుంతకల్లుకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు