ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఆగని సర్వేలు

11 Mar, 2019 16:05 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఎన్నికలు కోడ్‌ అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో దొంగ సర్వేలు కొనసాగుతునే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న యువకులను  స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోకి వచ్చిన యువకులు సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ ఏ పార్టీకి ఓటు వేస్తారని, ఇతర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా వారిని విచారించకుండానే పోలీసులు వదిలిపెట్టడం గమనార్హం.

కృష్ణాజిల్లాలోని పామర్రులో సర్వేల పేరులో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు కొంతమంది యువకులు. స్వాట్‌ డిజిటల్‌ అనే కంపనీ పేరుతో ఇంటింటికి సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు వారిని పట్టుకొని నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు