దిగజారిన ప్రివిలేజ్‌ కమిటీ గౌరవం

19 Mar, 2017 02:42 IST|Sakshi
దిగజారిన ప్రివిలేజ్‌ కమిటీ గౌరవం

రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, పుష్పా శ్రీవాణి ధ్వజం


సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్‌ కమిటీ గౌరవాన్ని దిగజారుస్తుందన్నారు. కక్షసాధింపు, రాజ కీయ వ్యతిరేకతతో చేసిన సిఫార్సులుగా ప్రజ లు భావిస్తున్నారన్నారు. సంవత్సరం నాలుగు నెలలపాటు ఆమె సస్పెన్షన్‌ పూర్తయ్యాక మరోసారి ఏడాదిపాటు పొడిగించాలనే సిఫార్సులు ఇంత ఆలస్యంగా రావడం దురుద్దేశ పూరితమైనవన్నారు.

విజయవాడ వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ విషయంలో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ కేసులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లున్నాయి. ఇవన్నీ గతంలో సభలో చర్చకు రాబోతున్న సమయంలో ఎమ్మెల్యే రోజా గొంతునొక్కాలనే ఉద్దేశంతో ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటేశారు. ఆమెను ఎదుర్కొనే ధైర్యంలేక పిరికి పందల్లాగా మరో ఏడాది సస్పెండ్‌ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని తక్షణమే విరమించు కోవాలి’’ అని సూచించారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు విచారం వ్యక్తం చేసినా మనస్ఫూర్తి గా విచారం వ్యక్తం చేయలేదని కమిటీ చెప్పడం దారుణమన్నారు.

ఎమ్మెల్యే రోజా చేసిన తప్పేంటి?
ఎమ్మెల్యే రోజా చేయని తప్పునకు 14 నెలలపాటు శిక్ష అనుభవించారని, అసలామె చేసిన తప్పేంటని కురుపాం ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలో తహశీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండించినందుకా? ర్యాగిం గ్‌కు బలైపోయిన రిషితేశ్వరి కుటుంబానికి అండగా ఉన్నందుకా? ‘కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌’ విషయంలో మహిళలపై చేసిన దారుణాల గురించి ప్రశ్నించినందుకా? వైజాగ్‌లో బీచ్‌ ఫెస్టివల్‌లో బికినీషోలు అడ్డుకున్నందుకా? ఎందుకు? మరో ఏడాది సస్పెండ్‌ చేయాలని చూస్తున్నారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీ శారు. మహిళా ఎమ్మెల్యేను చూసి   బాబు ఇంతగా  భయపడతారని అనుకోలేదన్నారు.

మరిన్ని వార్తలు