ఏ కష్టమొచ్చిందో..

24 Jun, 2018 08:26 IST|Sakshi

గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య

మృతులు శ్రీకాకుళం జిల్లావాసులుగా గుర్తింపు

 భార్యాభర్తలు, ఓ చిన్నారి మృతదేహాలు లభ్యం

 కొవ్వూరులో ఘటన

కొవ్వూరు రూరల్‌/కొవ్వూరు : ఏ కష్టమొచ్చిందో.. ఆరోగ్య సమస్యలా.. ఆర్థిక ఇబ్బందుల కారణమా.. ఏదైనా కాని ఓ కుటుంబం మూడు జిల్లాలు దాటి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కొవ్వూరు వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. శనివారం కొవ్వూరు లాంచీల రేవు శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టంలో గోదావరిలో తేలి యాడుతున్న మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, సీఐ సుభాకర్, ఎస్సైలు ఎస్‌ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్, పి.రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు.

 సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డు ఆధారంగా మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన పొందూరు రవికుమార్‌ (27), అతని భార్య పావని (24), కుమార్తె పూజిత (3)గా గుర్తించారు. ఈ మేరకు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సీఐ సుభాకర్‌ మాట్లాడుతూ సంఘటనా స్థలంలో లభించిన బ్యాగ్‌లో ఆధార్‌కార్డులతో పాటు రవికుమార్‌ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్‌ ఫైల్‌ ఉందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. 

బ్యాగ్‌లో మృతుడి తల్లి రమణమ్మ, మరో కుమార్తె హారిక (2) ఆధార్‌కార్డులు కూడా లభించాయన్నారు. వీరంతా శుక్రవా రం స్థానిక ఆంజనేయస్వామి స్నానఘట్టం వద్ద సంచరించారనే సమాచారం ఉందని, ఆ ప్రాంతంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. అయితే మరో కుమార్తె హా రిక ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మృతదేహా లను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని సీఐ సుభాకర్‌ చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం గోదావరిలో తేలియాడిన మరో పురుషుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

కడతేరిన ప్రేమబంధం
రవికుమార్, పావని ఐదేళ్ల క్రితం కులాంతర వివాహాం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రవికుమార్‌ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వీటికి ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రవికుమార్‌ తల్లి రమణమ్మ కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దిగి భయంతో వెనక్కి వ చ్చినట్టు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. అప్పటికే రవికుమార్‌ దంపతులు, ఇద్దరు కుమార్తెలు నదిలో మునిగిపోవడంతో రమణమ్మ కేకలు వేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. రవికుమార్‌ బీ టెక్‌ పూర్తి చేయగా పావని డిగ్రీ చదివింది. వీరు నరసన్నపేటలో నివాసముంటున్నారు. రవికుమా ర్‌ది గొర్రెలబంద గ్రామం కాగా, పావనిది కురుడు గ్రామం. 

చినవెంకన్నను దర్శించి..
నరసన్నపేట: తీర్థ యాత్రల పేరుతో బుధవారం నరసన్నపేట నుంచి బయలుదేరి గురువారం ఉద యం ద్వారకాతిరుమల వెళ్లామని రవికుమార్‌ త ల్లి రమణమ్మ నరసన్నపేటలో ‘సాక్షి’కి తెలిపారు. చినవెంకన్నకు పూజలు చేసి ఉన్న డబ్బు, బం గారు ఆభరణాలు హూండీలో వేసి సాయంత్రం నదికి వద్దకు వెళ్లి్లనట్టు చెప్పారు. అందరమూ ఒక రి చేతులు ఒకరు పట్టుకొని నదిలోని దిగామని ఇంతలో నీటి ఉద్ధృతికి తన చేతులు విడిపోయాయని.. వెంటనే తాను ఒడ్డుకు కొట్టుకు వచ్చానని, అక్కడి నుంచి నరసన్నపేట చేరుకున్నానని చెప్పింది.

మరిన్ని వార్తలు